కౌమార దశ వచ్చేసరికి పిల్లల్లో సెక్స్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. యవ్వనంలో అడుగిడే సమయానికి ఈ ఆసక్తులు మరింతగా పెరుగుతాయి. ఈ క్రమంలో అశ్లీల సాహిత్యం, నీలి చిత్రాల ప్రభావాలకు లోనుకావడం సహజమే. అయితే  ఈ ఆసక్తులు మోతాదుకు మించి దీర్ఘకాలం కొనసాగి వ్యసనంగా మారితే మాత్రం   ఆ  ప్రభావం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక ప్రవర్తనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ అంశం విషయంలో పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆకర్షణకు కారణాలు

 • వయసు ప్రభావం, తమను తాము లైంగికంగా ప్రేరేపించుకోవడానికి
 • స్నేహితులు లేదా సహోద్యోగుల ప్రేరణ, మీడియా ఆకర్షణ
 • ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ విరివిగా అందుబాటులోకి రావటం,
 • శృంగార సంబంధమైన అనుమానాలను నివృత్తి చేసుకోవటానికి 

మితిమీరితే తలెత్తే పరిణామాలు

 • అతిగా అశ్లీల సాహిత్య ప్రభావానికి లోనైన వారు పని, బాధ్యతలను పక్కన బెట్టి ఎప్పుడూ అవే ఆలోచనల్లో ఉంటారు. విద్యార్థులు చదువులో రాణించక పోవటం, ఉద్యోగులు కార్యాలయంలో అశ్లీల చిత్రాలను చూస్తూ ఉద్యోగాలు కోల్పోవటం జరుగుతుంది.
 • అశ్లీల చిత్రాల ప్రభావం ఎక్కువైతే నిజ జీవితంలో తమ లైంగిక భాగస్వాములూ అలాగే ఉండాలనుకోవటం, ఎక్కువ సేపు రతిలో పాల్గొనలేక నిరాశ చెందటం, ఈ ధోరణి దంపతుల మధ్య విడాకులకు దారి తీసే ప్రమాదం ఉంది.
 • అశ్లీలసాహిత్యం మోతాదు మించితే ఇష్టమైన వ్యాపకాలు, అభిరుచులు పక్కనబెట్టటం, కుటుంబ, స్నేహ బంధాలకు దూరంగా ఉండటం జరిగి, చివరకు ఏకాకులుగా మిగిలిపోతారు.
 • అశ్లీల చిత్రాల ప్రభావం వల్ల మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, దాడి చేసి ప్రమాదం కూడా ఉంటుంది. 

పెద్దల బాధ్యత

 • లైంగికపరమైన అంశాల గురించి పెద్దలు అవసరమైన మేరకు పిల్లలతో మాట్లాడాలి. వారి అనుమానాలను దాటవేయకుండా వివరించి , సెక్స్ కూడా జీవితంలో భాగమేనని అవగాహన కల్పించాలి.
 • అశ్లీల చిత్రాలలోని వ్యక్తులు, పరిస్థితులు నిజం కాదని పిల్లలకు వివరించి, శాస్త్రీయమైన  నిపుణుల అభిప్రాయాలను వారికి వివరించాలి.
 • నీలి చిత్రాలు చూడటం వ్యసనంగా మారి దానివల్ల ఆందోళన, కోపం, డిప్రెషన్, విసుగు వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నియంత్రించడానికి సంగీతం, సైకిల్ తొక్కడం, యోగా చేయడం వంటివాటిని ఆశ్రయించాలి.
 • ఈ వ్యసనం నియంత్రించలేని స్థాయికి చేరితే మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE