నవ్వు అందరికీ సులభంగా అర్ధమయ్యే భాష. ఆరోగ్యాన్ని అందించే అంటువ్యాధి. సంతోషాన్ని వ్యక్తం చేసే మేలైన మాధ్యమం. ఆస్వాదించగలిగిన వాడికి ఇది నిజంగా గొప్ప యోగం. రోజూ కాసేపైనా మనసారా నవ్వితే ఎలాంటి అనారోగ్యాలూ దరిజేరవు. నూటికి 62 శాతం మంది అమ్మాయిలు నవ్వించే అబ్బాయిలని ఇష్టపడతారనీ, తమ నవ్వించే ప్రయత్నానికి వేగంగా స్పందించే అమ్మాయిలనే అబ్బాయిలూ ఇష్టపడతారని మానసిక నిపుణులు చెబుతున్నమాట. హాస్య చతురత కలిగిన ఉద్యోగులు వృత్తిపరంగా రాణిస్తారని, సవాళ్ళను సమర్ధవంతంగా అధిగమిస్తారని తేలింది. నవ్వు విశిష్టతను గుర్తించి అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆసుపత్రులకు అనుబంధంగా లాఫింగ్ క్లబ్బులను ఏర్పాటు చేయటం విశేషం .

   ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. ఈ రోజుల్లో పెరిగిన జీవన వేగం కారణంగా రోజూ పట్టుమని 10 నిమిషాలైనా నవ్వలేని దుస్థితి నెలకొంది. దీన్ని నివారించి నవ్వు గొప్పదనాన్ని నలుగురికీ చాటాలనే ఉద్దేశంతో ఏటా జనవరి 10 న ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. నవ్వు గొప్పతనాన్ని గుర్తించే కొద్దీ నగరాల మొదలు పట్టణాల్లో జనం లాఫింగ్ క్లబ్బుల్లో సభ్యులుగా చేరటం, వీటి సంఖ్య నానాటికీ పెరగటం ఒకరకంగా శుభపరిణామం. 

నవ్వు ప్రయోజనాలు 

శారీరకంగా...

 • రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 • ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని కట్టడి చేస్తుంది.
 • నొప్పులు, వాపుల తీవ్రతను తగ్గిస్తుంది.
 • నవ్విన ప్రతిసారీ వందలాది కండరాలు రిలాక్స్ అవుతాయి.
 • హృదయ సంబంధిత సమస్యల బెడద తగ్గుతుంది.
 • మెదడుతో సహా పలు అవయవాలకు తగినంత ప్రాణవాయువు అందుతుంది.
 • ఇతరులతో పోల్చినప్పుడుహాస్య ప్రియులు మరింత యవ్వనంగా కనిపిస్తారు. 

మానసికంగా....

 • ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
 • లేనిపోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.
 • మానసిక ఒత్తిడిని అధిగమించే సామర్ధ్యం పెరుగుతుంది.
 • ఎదుటివారి నమ్మకాన్ని, సహానుభూతిని పొందుతాము.
 • చక్కని ఏకాగ్రత, గ్రహణ శక్తి సొంతమవుతుంది. 

సామాజికంగా...

 • కుటుంబ సభ్యులు, పొరుగువారితో బంధాలు బలపడతాయి.
 • నవ్విస్తూ మాట్లాడే వ్యక్తికి నలుగురిలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అతనితో మాట్లాడేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
 • పదిమందితో కలిసి కలిసి పనిచేసే తత్త్వం, చొరవ, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. 

నిపుణుల సూచనలు

 • మనిషి మెదడు అసలు నవ్వుకు, మొక్కుబడి నవ్వుకు మధ్య తేడాను గ్రహించలేదు. గనుక మనస్ఫూర్తిగా నవ్వలేకపోయినా చిరునవ్వయినా చిందించటం మంచిదే.
 • జోక్స్, కార్టూన్స్, నాటికలు, కథలు, సినిమాలోని హాస్య సన్నివేశాలను ఆస్వాదించటం ద్వారా ఎంతటి ఒత్తిడినైనా తొలగించుకోవచ్చు.
 • రోజూ కనీసం అరగంట సమయం స్నేహితులు, సహోద్యోగులతో సరదాగా గడపటం మంచిది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE