ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నంతసేపు కూలర్లు, ఏసీలు వాడక తప్పటం లేదు. అయితే.. అన్ని సందర్భాల్లో వీటిమీద ఆధారపడటం సాధ్యం కాదు గనుక ముందునుంచే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంటిని చల్లగా ఉంచుకోవటం మీద దృష్టి పెట్టాలి . ఈ మార్పుల వల్ల విద్యుత్తు ఆదా కావటమే గాక ఇంట్లో సహజసిద్దమైన, ఆహ్లాదకరమైన వాతావరణం సాధ్యమవుతుంది. ఈ వేసవిలో ఎండలు మరింతగా ఉండబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందునుంచే అందరూ ఈ దిశగా అడుగులు వేయటం మంచిది.  

  • ఇంటి కిటికీలకు బయటివైపు వట్టి వేళ్ళ పరదాలు కట్టి నీటితో తడిపితే ఇంట్లోకి చల్లనిగాలి వస్తుంది. దీనివల్ల ఏసీ లేదా కూలర్‌ల వినియోగం తగ్గటమే గాక ఇల్లంతా సువాసనగా ఉంటుంది.
  • వేసవిలో ఇంటిపైకప్పుకు, ఇంటిముందు ఫ్లోరింగ్ మీద కూల్‌ పెయింట్‌ వేయించుకోవటం వల్ల ఆ ప్రాంతం అతిగా వేడెక్కదు. అలాగే.. కప్పు నుండి వచ్చే వేడిని అరికట్టేలా కప్పుకు ధర్మాకోల్‌ షీట్లు అమర్చితే మరింత చల్లగా ఉంటుంది.
  • ఉదయం 8 గంటలకు ఇంటి కిటికీలు మూసి, తిరిగి సాయంత్రం 6 తర్వాత తెరిస్తే ఇంటిలోపల చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.
  • అన్ని గదుల్లోనూ ఎగ్జాస్ట్ ఫాన్లు పెట్టించటంతో బాటు తలుపులు, కిటికీలకు తెల్ల రంగు కర్టెన్లు వాడితే ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  • వరండా, కిటికీల వద్ద మొక్కల కుండీలు పెడితే ఉష్ణోగ్రత తగ్గటమేగాక వాటిని చూసినప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
  • ఉదయం 9 లోపు, సాయంత్రం 8 తర్వాత వంట చేసుకోవటంతో బాటు వంటగదిలో చిమ్నీ అమర్చటం వల్ల ఇంట్లో వేడి తగ్గుతుంది.
  • వేసవిలో టీవీ, కంప్యూటర్, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్, వ్యాక్యూమ్ క్లీనర్, హీటర్ల వినియోగాన్ని వీలున్న మేరకు పరిమితం చేసుకోవాలి.
  • ఇంటి గోడల వెంబడి అనవసరంగా పడివుండే పెద్ద పెద్ద రాళ్లు, సిమెంట్‌ నిర్మాణాలను ముందే తొలగించాలి. లేకుంటే అవి పగటి వేడికి వేడెక్కి సాయంత్రానికి గోడల ద్వారా ఆ వేడిని ఇంట్లోకి ప్రసరింపజేస్తాయి.
  • వేసవిలో పగటిపూట ఓవర్‌ హెడ్‌ ట్యాంకులో నీరు లేకుండా చూసుకోవాలి. అందుకే ఉదయం పూటే బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటంలాంటి పనులు పూర్తి చేసి తగినంత నీరు టబ్బుల్లో, బక్కెట్లలో నీళ్లు నిల్వ చేసుకుని వాడుకోవాలి. లేకుంటే వేడిక్కిన నీటి వల్ల కప్పు, గోడల్లోని పైపుల వల్ల గదులన్నీ వేడెక్కుతాయి.
  • ట్రేలో ఐస్ ముక్కలు వేసి ఫ్యాన్‌ కింద పెట్టినా లేదా టబ్బులో చల్లని నీరుపోసి గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE