విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ పట్టొచ్చు.  పెద్దలతో పోల్చితే చిన్నారుల విషయంలో ఈ విషాదాల ప్రభావం మరింత ఎక్కువ. ముఖ్యంగా బాల్యంలోనే కుటుంబ సభ్యులను కోల్పోవటం, ప్రమాదాల వల్ల అంగవైకల్యానికి గురికావటం, తీవ్రమైన అనారోగ్యానికి గురికావటం, ఇంటాబయటా ఎదురయ్యే శారీరక మానసిక వేధింపులు పిల్లలను చెప్పలేనంతగా కుంగదీస్తాయి. ఇలాంటి పిల్లల విషయంలో పెద్దలు ప్రత్యేక శ్రద్ధను కనబరచి సరైన సమయంలో వారికి మానసిక నిపుణులకు చూపించాలి. లేకుంటే ఈ ఒత్తిళ్లు తీవ్రమైన మానసిక రుగ్మతలుగా మారే ప్రమాదం ఉంటుంది. 

లక్షణాలు

పలు కారణాల వల్ల పిల్లల మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీటిలో ప్రకృతి విపత్తులు, కుటుంబ సభ్యుల అకాల మరణం మొదలు చదువులో రాణించలేకపోవటం వరకు ఏదైనా సమస్యకు కారణం కావచ్చు. కుటుంబ సభ్యులు లేని ఉన్నా వారి ఆదరణ లేని పిల్లలు మరింత త్వరగా ఈ తరహా ఒత్తిళ్లకు లోనవుతారు. ఈ పిల్లల్లో ఆత్మన్యూనత, ఒంటరిగా ఉండిపోవటం, శూన్య భావన, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తమపై తామే కోప్పడటం, అసహ్యించుకోవటం, నిస్సహాయులుగా భావించుకోవటం, తమను తామే నిందించుకోవటం, తానెందుకూ పనికిరాననే భావనలతో నిరంతరం సతమతమవుతారు. ఈ దశలో వారు పెద్దల సానుభూతిని, తోడును, సహకారాన్ని కోరుకుంటారు. 'నీకు నేనున్నాను' అనే చిన్న భరోసా ఆ పరిస్థితిలో వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇది లభించనప్పుడు పిల్లలు తీవ్ర అసహనం, చికాకు, కంగారు, మోసపోయామనే భావన, అపనమ్మకం, ఉదాసీనతకు లోనవుతారు. సున్నిత మనస్కులైన పిల్లలైతే తమలో తాము మాట్లాడుకోవటం, ప్రపంచం కష్టాల మయమని నమ్మటం, ప్రపంచంలో తాను తప్ప అందరూ సంతోషమగా ఉన్నారనే భావన , ఈ సమస్యల నుంచి ఎప్పటికీ బయటపడలేమనే నిస్సహాయతకు లోనవుతారు.కొందరిలో ఈ పరిస్థితి విషమించి తీవ్ర హృదయ విఘాతానికీ (ట్రామా), ఆత్మహత్యలకూ దారితీయొచ్చు. 

ఇలా చేయాలి

  • పిల్లల సమస్యను చిన్నదిగా చేసి చూపేలా పెద్దలు మాట్లాడాలి. జీవితంలో ఇబ్బందులు లేని మనిషి లేడనీ, వాటిని అధిగమించి నిలిచినవాడే మనిషనీ వారికి చెప్పాలి.
  • పిల్లల అర్హతలు, ప్రతిభను, గత విజయాలను, వారి బలాలను గుర్తుచేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలి.
  • స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసిపోయేలా చూడాలి.
  • జీవితంలో ఎన్నో ఇబ్బందులను అధిగమించి విజేతలుగా నిలిచిన వారి జీవితాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు.
  • ఈ పిల్లలను మొక్కల పెంపకం, పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూడటం, సంగీతం వంటి వ్యాపకాల్లో నిమగ్నమయ్యేలా చూడాలి.
  • తప్పనిసరిగా మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE