• HOME
  • ఆహ్లాదం
  • మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఇక్కట్లే

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. వినోదం, ఆటలు, ఆన్ లైన్ షాపింగ్, బ్యాంకింగ్ సేవల వంటి ఎన్నో సేవలను స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి తీసుకొచ్చింది. దీంతో ఇదో తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే.. అదే సమయంలో ఈ మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగం యువతను చెప్పలేనంత మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. నేటి యువత రోజులో 20 శాతం సమయం స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణి మూలంగా వచ్చే కొన్ని సమస్యల గురించీ వారు హెచ్చరిస్తున్నారు.

ఇవీ సమస్యలు 

  • మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. దీనివల్ల చేయాల్సిన పని ఆలస్యం కావటమే గాక పని నాణ్యత, ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోతోంది.
  • ఏ పని చేస్తున్నా మనసంతా స్మార్ట్ ఫోన్ మీదే ఉండటం, ఏ కొద్దీ శబ్దం వచ్చినా తమ ఫోన్‌ మోగినట్లు భావించటం, ప్రయాణాల్లో పక్కవారి ఫోన్ మోగగానే తమ ఫోన్ చెక్ చేసుకోవటం వంటి అవాంఛిత లక్షణాలు కనిపిస్తాయి.
  • కొత్త నంబర్ల నుంచి ఫోన్ రాగానే ఏదో తెలియని కంగారు, గందరగోళానికి గురవుతారు. తిరిగి వారికి ఫోన్ చేసేందుకు సాహసించరు. ఇలాంటి కాల్ వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. అటు స్విచాఫ్‌ చేయలేక, ఇటు కాల్ మాట్లాడలేక సతమతం అవుతుంటారు.
  • స్నేహితులు, పరిచయస్తులతో వీలున్నంత సమయం చాట్ చేయటం, ఏ కారణం వల్లనైనా ఇంటర్నెట్ లేకపొతే వెర్రెక్కినట్లు ప్రవర్తించటం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తన పోస్టులకు తగిన రాకపోతే నిరాశ పడటమూ కనిపిస్తోంది.
  • రోజంతా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల దాని తేరా వెలుగు దెబ్బకు నేత్ర సమస్యల బారిన పడుతున్నారు.
  • స్మార్ట్ ఫోన్ లోని సమాచారం, తమ సంభాషణలు ఇతరులు చూడకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటం, ఇతరులు తమ స్మార్ట్ ఫోన్ తీసుకోగానే లేనిపోని ఒత్తిడికి గురికావటం వంటి లక్షణాలూ ఎక్కువే.
  • మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగంతో శరీరం మీద రేడియషన్ ఎక్కువై సంతానలేమి, పలు రోగాలూ వస్తున్నాయి. ఇక మానసిక ఒత్తిడి కారణంగా ఒంటరితనానికి అలవాటుపడతారు.
  • పొద్దుపోయేదాకా దానితో గడపటంతో నిద్రలేమి సమస్యలు, కుటుంబ సభ్యులతో సరిగా సమయం గడపకపోవటం, పెద్దలు ఏదైనా చెబితే విసుక్కోవటం, పెళ్లి వంటి సందర్భాల్లో పెద్దలతో వెళ్ళటానికి ఇష్టపడకపోవటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. 

మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగపు ప్రతికూల ప్రభావాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆధునిక టెక్నాలజీని స్వాగతించాలి గానీ అది మరిన్ని సమస్యలకు కారణం కారాదనే సత్యాన్నికనీసం ఇప్పుడైనా మనం గ్రహించాలి. అప్పుడే ఒత్తిడిలేని, ఆనందమయమైన రీతిలో ఉండగలము.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE