తెలంగాణ గడ్డ అందమైన, అరుదైన పలుకుబడులకూ, జీవనశైలులకూ చిరునామా. ఇక్కడి జనపదాలు గొప్ప, అరుదైన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. అక్కడి గ్రామీణ జనం చూపే ఆత్మీయత, అనురాగాలు ఎంతటివాడినైనా కట్టిపడేస్తాయి. ఎన్నో భాషలు, సంప్రదాయాలకు కూడలి ఈ నేల. ఇక్కడి ముఖ్యమైన పండుగలలో దసరాది తొలి స్థానం. దీన్నిపెద్దల పండుగనీ అంటారు.ఈ దసరాకు పూర్వ రంగమే బతుకమ్మ పండుగ. 

రోజుకోతీరు బతుకమ్మ

బతుకమ్మ 9 రోజులపాటు సాగే పండుగ. మహాలయ (పితృ) అమావాస్యనాడు బొడ్డెమ్మ ఆటతో బతుకమ్మ పండుగ మొదలౌతుంది. దీన్నే ఎంగిలిపూవు బతుకమ్మగా చెబుతారు. రెండోరోజు అంటే..ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను ఆరాధిస్తారు. మూడోరోజు.. అంటే ద్వితీయ నాడు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు (తదియ) రోజు తండుల బతుకమ్మ, ఐదోరోజు (చవితి) అట్ల బతుకమ్మ, ఆరోరోజు( పంచమి) అలుక బతుకమ్మ,  ఏడో రోజు (షష్ఠి) వేప బతుకమ్మ, ఎనిమిదోరోజు(సప్తమి) నవనీత బతుకమ్మ, తొమ్మిదోరోజు (అష్టమి) చద్దుల బతుకమ్మ గా మహిళల పూజలందుకొంటుంది.

పూల పండుగ

 తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చేమంతి వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను ఒక పళ్లెంలో శిఖరంలా పేరుస్తారు. నిజానికి ఈ బతుకమ్మ ప్రకృతి శక్తికి, మానవాళికి అన్నీ ప్రసాదించే ఆదిశక్తి కి ప్రతీక. శక్తిని శ్రీచక్ర రూపంలో కొలవడం మన సంప్రదాయం. అలాగే బతుకమ్మ సైతం అదే రూపులో ఉండటం విశేషం. ఇలా అలంకరించిన బతుకమ్మలను ఇళ్ల మందు, గ్రామ కూడళ్లలో, ఆలయాల్లో, మైదానాల్లో కొలువుదీర్చి పూజించి, మహిళలంతా అప్రదక్షిణంలా తిరుగుతూ లయబద్దంగా గొంతెత్తి బతుకమ్మ పాటలు పాడే తీరు, ఈ క్రమంలో చూపే కర విన్యాసాలు, కొట్టే చప్పట్ల గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇలా 9 రోజులూ వేర్వేరు పేర్లతో బతుకమ్మను పూజించి పలు నైవేద్యాలు సమర్పిస్తారు. ఏరోజుకారోజు బతుకమ్మలను మంచినీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా మహాలయ అమావాస్య సాయంత్రం మొదలయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమి రోజు వరకు తొమ్మిది దినాలు కొనసాగుతుంది. చివరిరోజు చద్దుల బతుకమ్మను కొలిచి నిమజ్జనం చేసి చెరువు, కాలువ, నదీ తీరాలలో చద్దులను ఆరగిస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పూజించే మహిళలకు సౌభాగ్యం, సంతాన భాగ్యం, ఆయురారోగ్య సంపదలు సిద్ధిస్తాయని చెబుతారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE