నవ్వు నలభై రకాల మేలనేది నేటి నిపుణులు చెబుతున్న మాట. మానసిక ఒత్తిడిని దూరం చేయటంతో బాటు మేలైన ముఖ వ్యాయామంగానూ నవ్వు పనిచేస్తుంది. కాలంతో బాటు మనిషి కూడా పరిగెత్తే ఈ రోజుల్లో ఒత్తిడి సహజం కనుక లాఫింగ్ క్లబ్బులు, లాఫ్టర్ థెరపీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వీటిలో నవ్వటం ద్వారానే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసే ప్రక్రియే లాఫ్టర్ థెరపీ. దీనివల్ల కలిగే ప్రయోజనాలు.. 

  • నవ్వటం ద్వారా శరీర కండరాలు విశ్రాంతి పొందుతాయి, నవ్వుతో రక్తనాళాలు వ్యాకోచించి శరీరమంతా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది.
  • నవ్వు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
  • నవ్వినపుడు మనిషి సహజంగానే ఎక్కువగా ప్రాణవాయువును పీల్చుకుంటాడు. ఫలితంగా గొప్ప ఉపశమనాన్ని పొందుతాడు.
  • నవ్వినప్పుడు శరీరంలో ఎక్కువ ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి ఆర్ధ్రైటిస్‌, స్పాండిలైటిస్‌, కండరాల నొప్పులు మైగ్రేన్‌, ఉద్రిక్తత మూలంగా వచ్చే తలనొప్పులను తగ్గిస్తాయి.
  • నవ్వు ఊపిరితిత్తుల సామర్ద్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా బ్రాంకైటిస్‌, ఉబ్బస బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయిని కూడా నవ్వు పెంచుతుంది.
  • రోజూ 10 నిమిషాలు లాఫ్టర్ థెరపీ చేయటం ద్వారా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
  • లాఫ్టర్ థెరపీ ఎయిరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ వంటిది. దీనివల్ల గుండె, రక్త సరఫరా వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా నీడపట్టున ఉండేవారికి ఇదెంతో మంచిది.
  • లాఫ్టర్‌ థెరపీ చేసేవారికి డిప్రెషన్‌, ఆందోళన, నరాల బలహీనత , నిద్రలేమి తదితర సమస్యలు రావు. ఉన్నా దూరమవుతాయి.
  • ఈ ప్రక్రియ మూలంగా ముఖ కండరాలకు తగిన వ్యాయామం లభించి అక్కడి కండరాలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది . దీనివల్ల ముఖచర్మం కాంతివంతమవుతుంది.
  • ఈ ప్రక్రియ వల్ల ముభావంగా ఉండేవారు సైతం ఇతరులతో కలుపుగోలుతనంగా ఉంటారు. దీనివల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE