గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. కానీ సామాజిక మార్పులు, ఆలోచనా విధానం వంటి పలు మార్పుల మూలంగా ఇప్పటి తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో సమయంతో బాటు తగినంత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పిల్లల చదువుల విషయంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నేటి పెద్దలూ మారాల్సిన సందర్భమిది.

పెద్దలు గుర్తించాల్సినవి 

 • పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించటంతో బాటు అందుకు తగిన వాతావరణాన్ని ఇంట్లో పెద్దలు ఉండేలా చూడాలి.
 • చేతివేళ్ళ వలే ఏ ఇద్దరు పిల్లల గ్రహణ శక్తులూ ఒకేలా వుండవనీ పెద్దలు గుర్తెరగాలి.
 • కష్టమైన హోంవర్కు లో తగినంత సాయం పెద్దలు చేయాల్సిందే. అయితే అన్నింటా జోక్యం చేసుకొరాదు. దీనివల్ల పిల్లలు పెద్దల మీద అతిగా ఆధారపడి వారు లేకుండా ఏ పనీ చేయలేకపోతారు.
 • పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను తల్లిదండ్రులు ఆశించక వాస్తవిక దృష్టితో వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల కోణం నుంచీ ఆలోచించే ప్రయత్నం చేయాలి.
 • పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయటం, కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది.
 • తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళి, ఉపాధ్యాయులను కలిసి పిల్లల మీద వారి అభిప్రాయాలను తెలుసుకోవటం ద్వారా పిల్లల విషయంలో వీరికున్న అపోహలు తొలగిపోతాయి.
 • పిల్లలు చదువులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే తమ శక్తి సామర్థ్యాలపై మరింత గురి కుదురుతుంది.
 • చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి కించబరచరాదు. దీనికి బదులు సానుకూలమైన సలహాలివ్వటం, ఇంకా కేసత్పదామని ప్రోత్సహించటం అవసరం.
 • చదువుతోపాటు ఆటపాటలు ఉంటేనే వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు గనుక పిల్లలు రోజూ కొంత సమయం ఆటలు, వ్యాయామం వంటివాటికి కేటాయించేలా చూడాలి.
 • కంటిచూపు లోపాలు, బుడ్డి మాంద్యం వంటి జన్మతః వచ్చే కొన్ని సమస్యల కారణంగా పిల్లలు చదువులో వెనకబడొచ్చు. ఇలాంటి సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స ఇప్పించాలి.
 • పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్ధమయ్యే భాషలో వివరించి వారిని సంతృప్తిపరచాలి తప్ప విసుక్కోరాదు. దీనివల్ల పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి.
 • పిల్లలు ఒక సబ్జెక్టులో వెనుకబడటానికి కారణాలు అవగాహన చేసుకొని, ఇంట్లో బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా, పెద్దలు శిక్షణనివ్వాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారు.
 • కులం తేడాలు, బీద గొప్ప భేదభావాలను ప్రస్తావించి కొందరితోనే స్నేహం చేయ్యాలనే బోధలు చేయరాదు. దీనివల్ల పిల్లలు ప్రతిభను గుర్తించలేకపోతారు.
 • అబ్బాయికి ఇంజనీరింగ్ వంటి మంచి చదువు , అమ్మాయికి డిగ్రీ చాలనే బేధభావాలు తల్లిదండ్రులు ఎట్టిపరిస్థితిలోనూ చూపరాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE