పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు ఆరగిస్తూ, టపాసులు కాల్చుతూ ఆనందంతో గడుపుతుంటారు. పిల్లల దృష్టిలో అయితే ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ టపాకాయలే. అయితే వెలుగులు విరజిమ్మే టపాకాయలు కాల్చే విషయంలో కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా ఒళ్ళు కాలటం, కంటి చూపు దెబ్బతినటం వంటి పలు ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా ఏ ఇబ్బందీ లేకుండా టపాకాయలు కాల్చుకోవటమే గాక ఈ దీపావళి పండుగను ఒక మధుర జ్ఞాపకం గానూ నిలుపుకోవచ్చు. అవి ..

జాగ్రత్తలివే..

 • ఇంటిలోని వాహనాలను జాగ్రత్తగా పార్కింగ్ చేసి వాటిపై కవర్లు వేసిన తర్వాతే బాణా సంచా కాల్చటం మొదలు పెట్టాలి. టపాసులు కాల్చేచోటముందు జాగ్రత్తగా ఒక బక్కెట్టు నీళ్లు పెట్టుకొంటే మంచిది.
 • టపాసులు కాల్చే వేళ నూలు దుస్తులు ధరించడం మంచిది. దీనివల్ల ఒంటిమీద నిప్పురవ్వలు పడినా అంటుకోవు. ఒకవేళ ఒంటికి నిప్పంటుకొంటే దుప్పటి కప్పి మంటను నిరోధించాలి.
 • టపాసులు కాల్చే పిల్లలు వదులైన వేళ్ళాడే దుస్తులకు బదులు కురచగా, సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. జుట్టును ముడుచుకొని క్లిప్ పెట్టుకోవాలి.
 • పెద్ద పెద్ద బాంబుల శబ్దాల ప్రభావం లేకుండా పసిపిల్లలు, టపాసులు కాల్చే పిల్లల చెవుల్లో దూదిపెట్టండి. లేకుంటే సున్నితమైన కర్ణభేరి దెబ్బతినొచ్చు.
 • పిల్లలకు టపాకాయలు చూస్తేనేఎంతో ఉత్సాహం. ఆ ఉత్సాహంలో వాళ్ళు అన్నీ మరిచిపోతారు. కనుక పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా వెంట ఉండి జాగ్రత్తలు చెప్పాలి.
 • రోడ్డు మీద, ఇంటిలోపల, గుంపులుగా ఉన్నచోట టపాసులు కాల్చకూడదు. పూలదండలాగా ఉండే టపాసులను దూరంగా పరచి కాకారపువ్వొత్తి వాడి వెలిగించాలి.
 • భూ చక్రాలు వెలిగించేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. అక్కడ పాకే పసిపిల్లలుంటే ఎత్తుకోవాలి.
 • పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు, తర్వాత చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకుండా చూడాలి.
 • ఒకసారి వెలిగి పేలకుండా ఆరిపోయిన చిచ్చుబుడ్లు, బాంబుల వద్దకు వెళ్లి దగ్గరగా ముఖం పెట్టి పరిశీలించడం, మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.
 • నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలైతే అయోడిన్ వేసి దూదితో తుడిచే బర్నాల్ రాయాలి. అవసరాన్ని బట్టి వైద్యసలహా తీసుకోవాలి.
 • పెంపుడు జంతువులకు టపాకాయల చప్పుడు అంటే ఎంతో భయం. అందుకే వాటిని ఇంటిలోనే ఒక గదిలో పెట్టి తలుపులు వేసి ఉంచాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE