ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు , ఊహించని ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు, సామాజిక అంశాలు, వృత్తి పరమైన ఒత్తిళ్లు, ప్రేమ వ్యవహారాల్లో ఒడిదొడుకులు ఈ ఒత్తిడికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఈ మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగటం మూలంగా డిప్రెషన్ తదితర సమస్యలొస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు..   

  • మానసిక ఒత్తిడికి ప్రాణాయామం మేలైన పరిష్కారం. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు 10 నిమిషాల పాటు గట్టిగా గాలి పీల్చి, వదులుతూ ఉండాలి. దీనివల్ల కొంత ఒత్తిడి భారం తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలో రోజూ సూర్యోదయ సమయాన ఇలా చేయగలిగితే ఒత్తిడి దాదాపుగా దరిజేరదు.
  • రోజూ ఉదయ సమయాన కనీసం 40 నిమిషాల పాటు నడక, జాగింగ్, సైక్లింగ్, జిమ్, పరుగు వంటి వ్యాయామాలు చేసేవారు ఎంతటి మానసిక ఒత్తిడినైనా అధిగమించగలుగుతారు. వీటివల్ల మంచి ఆరోగ్యం, చక్కని శరీరాకృతి కూడా పొందొచ్చు.
  • సంగీతం, డాన్స్, బొమ్మలు వేయటం, కొత్త ప్రదేశాలు తిరగటం, మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకం, నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వంటివి మానసిక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. కనుక రోజులో కనీసం 1 గంట కేటాయిస్తే ఒత్తిడి ముప్పే ఉండదు.
  • మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలన్నా, వదిలించుకోవాలన్నా వేపుళ్ళు , జంక్ ఫుడ్, స్వీట్ల వినియోగానికి దూరంగా ఉండాల్సిందే. వీరు వేళ పట్టున ఆహారంతో బాటు తాజా పండ్లు, పండ్ల రసాలు, తాజా సలాడ్‌లు తీసుకోవటం ద్వారా మానసిక ఒత్తిడిని వదిలించుకోవచ్చు.
  • ఒత్తిడి బాధితులకు కంటిమీద కునుకు ఉండదు. ఈ కలత నిద్ర సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంటుంది. అందుకే రోజుకు కనీసం 8 గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పగటిపూట నిద్ర అలవాటు ఉంటే మానుకొంటే రాత్రి నిద్రకు ఇబ్బంది ఉండదు.
  • ఒత్తిడితో కూడిన బాధ్యతలు నిర్వహించేవారు వారానికోసారైనా మసాజ్ చేయించుకోవటం ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
  • అసూయ, కోపాలకు దూరంగా ఉండటంతో బాటు సమయపాలన నియమాన్ని పాటిస్తే మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచటం సాధ్యమే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE