• HOME
  • ఆహ్లాదం
  • మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా మీ ఆరోగ్య పరి రక్షణ కోసం లెక్కకు మించినన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు దోహదపడే కొన్ని యాప్స్, వాటి వివరాలు తెలుసుకుందాం. 

  • మనలో చాలామంది ఉదయం లేచింది మొదలు పడుకోబోయే వరకు ఎప్పుడు ఏ పని చేయాలో ముందుగా నిర్ణయించుకొంటాం. కానీ మతిమరుపుతోనో లేదో పని ఒత్తిడిలోనో పడి సగం పనులే చేయగలుగుతాం. ఎలా రోజుకు కొన్ని చొప్పున పనులు పెండింగ్ పడి వాటిని ఒక్కసారి చేయాల్సి రాగానే చేతులెత్తేస్తుంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే యాప్ 'వండర్‌లిస్ట్‌'. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని మానపనులు, సమయాలను పొందుపరిస్తే చాలు. ఆ సమయానికి ఈ యాప్‌ గుర్తు చేస్తుంది. ఈ యాప్ పని దినచర్యను ప్రణాళికాబద్ధంగా మార్చి మానసికఒత్తిడిని దరిజేరనీయదు. (wonder list)
  • మనలో సగం మంది శారీరక అవసరాలకు తగినన్ని నీరు తాగరు. దీనివల్ల జీవక్రియల వేగం, పనితీరు మందగిస్తాయి. దీంతో శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను అధిగమించడానికి డ్రింక్‌ వాటర్‌’ యాప్‌ ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ యాప్ సమయం, తాగాల్సిన నీటి పరిమాణాలను సమయానికి అనుగుణంగా మనకు గుర్తు చేస్తుంది. (Drinkwater) 
  • తగినంత నిద్ర కోరుకొనేవారికి ఉపయోగపడే యాప్ 'స్లీప్‌ సైకిల్‌ అలారం క్లాక్‌' . సమయానికి నిద్రలేవడానికి ఫోన్ అలారం వాడినా, ఒక్కోసారి లేవలేము. కొన్నిసార్లు ఆలస్యంగా పడుకొన్నరోజుల్లోనూ ఈ ఫోన్ అలారం దెబ్బకు నిద్రలేవాల్సి వస్తుంది. ఈ యాప్ అలాకాదు. పగలు ఎంత సమయం పని చేసాం, ఏ ఆహారం తీసుకొన్నాం? అనే వివరాల ఆధారంగా ఎంత నిద్ర అవసరం, ఎప్పుడు నిద్రలేపాలి అనేవి దానంతట అదే లెక్కిస్తుంది. అంతేగాక ఆహారం ప్రభావం నిద్ర మీద ఎలా ఉండబోతోందో ముందే సూచిస్తుంది. (sleep cycle alarm clock). 
  • ఈ రోజుల్లో ఎక్కువమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వీరికోసం డిజైన్ చేసినదే.. calm యాప్. ఇది పడుకొన్న వెంటనే నిద్ర పట్టకపోవడం, లేనిపోని ఆలోచనలు, భయాలు వంటి ఇబ్బందులను దూరం చేసి హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది. వినసొంపైన సంగీతాన్ని, నిద్రపుచ్చే కథలనూ వినిపించటం దీని మరో ప్రత్యేకత. 
  • ఈ రోజుల్లో ట్రాఫిక్‌ సమస్య ఎంత ఉందో తెలిసిందే. ముఖ్యంగా పెద్ద షాపింగ్ మాల్స్, స్టేడియాలలో పార్క్ చేసిన వాహనం ఎక్కడుందో పనిగట్టుకు వెతకాల్సి వస్తుంది. కొత్త ప్రదేశాల్లో ఒక్కోసారి ఇందుకోసం కొంత ఎక్కువ సమయమే పడుతుంది . ఈ సమస్యను దూరం చేసే యాప్ ‘కార్‌ మేటీ’. నేవిగేషన్‌ ఆధారంగా పని చేసే ఈ యాప్ మీ కార్ దగ్గరకు నేరుగా వెళ్లే మార్గాన్ని చూపుతుంది. (carrr matey). 
  • జీవనశైలి, శరీర స్వభావం వంటి వివరాలను బట్టి మన ఆరోగ్య సమస్యలను తెలియజెప్పే యాప్స్ లో 'పూ లాగ్‌' ప్రత్యేకమైనది. ముఖ్యంగా జీర్ణ సమస్యలను ముందుగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. (poo log)
  • మద్యం అలవాటు ఉన్నవారిలో కొందరు ఒక్కోసారి మోతాదు ఎక్కువైనప్పుడు నానా అల్లరీ చేస్తుంటారు. ఈ క్రమంలో నచ్చని వారికి ఫోన్ చేసి వాదించటం వంటివి చేస్తారు. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. ఇలాంటివారు ‘డ్రంక్‌ లాకర్‌’ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మద్యం సేవించే ముందు ఆన్ చేస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ రావు. పైగా ఎంపిక చేసుకొన్న నంబర్లకు అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ కూడా ఆగిపోతాయి. (drunk locker).

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE