మన దేశంలో ఏడాది పొడవునా ఏదో ఒకచోట పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే దేశమంతా జరుపుకొనే పండుగలూ ఉన్నాయి. అలాంటివాటిలో  హోళీ ఒకటి. కుల, మత, ప్రాంతాల కతీతంగా, ఏ వయోభేదం లేకుండా చేసుకొనే పండుగ ఇది. వసంత రుతువు రాకకు గుర్తుగా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున ఈ పండుగ చేసుకోవటం సంప్రదాయం. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో  మహా పాల్గుణి,  హోలికా దహన్, హోళీ అనే పేర్లతోనూ జరుపుకొంటారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో ఈ పండుగను 'డోలికోత్సవం' గా జరుపుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఉల్లాసంగా గుమికూడి నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. ఈ రంగుల హోళీ  మన జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ... పాఠకులకు బీపాజిటివ్ తరపున హోళీ శుభాకాంక్షలు.   

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE