"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

ఆధునిక మహిళ సమాజంలో గుర్తింపు, సాధికారిత, సమానత్వాల కోసం నిరంతరం పోరాడుతోంది. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా కుటుంబ బాధ్యతల బరువు మోసేది ఆమే. బహుముఖీయమైన మహిళ జీవితాన్ని అర్థంచేసుకొనేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చక్కని సందర్భం. అవాంతరాలను, అణచివేతలను అధిగమించి ఇంటా బయటా, సమాజ ప్రగతికి బాటలు పరచిన ఎందరో మహిళా మణులను స్మరించుకునే ఘట్టం. ఎన్నో విభిన్న రంగాల్లో మహిళలు తమదైన శైలిలో రాణిస్తున్న తీరు ఎంతో ముదావహం. రేపటి పట్ల ఆశతో ఉత్సాహంతో ముందడుగు వేసే నేటి మహిళను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలో అందరిదీ. వివక్ష, అసమానతలను ఎడమచేత్తో వెనక్కితోసి విజయం వైపు వడివడిగా దూసుకెళ్తున్న నేటి మహిళలే రేపటి ప్రపంచానికి ఆశాజ్యోతులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ బీపాజిటివ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE