మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ ఏదో ఒక కొత్త కోరిక పుట్టటం సహజమే. లేనిదాన్ని పొందేందుకు విశ్రాంతి, విసుగూ విరామం లేకుండా ఆరాటపడటం, ఈ క్రమంలో మనదగ్గర అప్పటికే ఉన్నవాటిని అనుభవించలేకపోవటం జరుగుతోంది. ఈ రోజుల్లో కాస్త అటు ఇటుగా అందరిదీ ఇదే పరిస్థితి. అయితే ఈ కోరికలను అదుపు చేసుకోవడం సాధ్యమేననీ, లేనివాటి కోసం పాకులాడకుండా ఉన్నవాటిని ఇష్టంగా స్వీకరించడం అలవాటు చేసుకొంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం ఎవరికివారు తమ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేసుకొని అందుకు తగినట్లు జీవిత అవసరాలను నిర్ణయించుకోవటమే ఏకైన మార్గం. ఇతరులను ప్రేమించడం, వారి ప్రేమను పొందగలగలగటం, ఉన్నంతలో చేతనైనంతలో లేనివారికి సాయం చేయటం, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించటం, మూగజీవుల పట్ల కరుణ చూపటం, మనసుకు ఇష్టమైన వ్యాపకాలను అలవరచుకోవటం వంటి లక్షణాలను అలవరచుకోవటం వల్ల ఈ సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు హామీ ఇస్తున్నారు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE