• HOME
  • అందం
  • చుండ్రుకు చెక్ పెట్టే చిట్కాలు

కేశాల ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బదీసే వాటిలో  చుండ్రు ప్రధానమైనది. వాతావరణ కాలుష్యం మూలంగా తలమీద చేరిన దుమ్ము, ధూళి, ఎండ కారణంగా పట్టే చెమట వంటివి ఈ చుండ్రుకు ప్రధాన కారణాలు. చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

  • తలస్నానం చేయటానికి ముందు జుట్టుకు తగినంత పెరుగు పట్టించి బాగా ఆరిన తర్వాత స్నానం చేస్తే చుండ్రు తీవ్రత తగ్గుతుంది.
  • వారానికి కనీసం రెండుసార్లు కలబంద(అలోవేరా )గుజ్జుకు తగినంత మెంతిపిండి కలిపి జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు బాధ తొలగిపోతుంది.
  • వేపనూనె, కర్పూరం కలిపి జుట్టు,మాడుకు బాగా పట్టించి ఆరనిచ్చి తలస్నానం చేస్తే ఎంత చుండ్రు ఉన్నా వదిలిపోతుంది.
  • గోరు వెచ్చని కొబ్బరినూనెలో ముద్ద కర్పూరం కలిపి ఆ నూనెతో తలంటుకొని ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
  • వారానికి కనీసం రెండు సార్లు శీకాయ పొడి లేదా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే చుండ్రు త్వరగా వదిలి పోతుంది.
  • ఔషధ నూనెను మాడుకు బాగా పట్టించి మర్దనా చేయటం వల్ల చుండ్రు వదిలిపోతుంది.
  • కొబ్బరి నూనెలో పారిజాతం గింజల పొడిని కలిపి ఆ మిశ్రమంతో తలంటుకొంటే చుండ్రు పూర్తిగా వదిలి పోతుంది. కొబ్బరినీళ్ళలో చెంచాడు నిమ్మరసం కలిపి తాగినా చుండ్రు బెడద తగ్గుతుంది.
  • గుడ్డు సొనకు రెండు చెంచాల షాంపూ కలిపి బాగా కలిపి దానితో తలస్నానం చేస్తే సమస్య దారికొస్తుంది.
  • వేడి వేడి కొబ్బరి నూనెలో పచ్చి మందార ఆకులను వేసి మరగనిచ్చి ఈ నూనెను తలకు రాసుకుంటే చుండ్రు క్రమంగా తగ్గుతుంది.
  • తలస్నానికి ముందు ముద్దగా నూరిన గసగసాల మిశ్రమాన్ని బాగా జుట్టుకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి.
  • వేడి నీటిలో రెండు నిమ్మకాయలు పిండి ఆ నీటితో తలస్నానం చేస్తే సమస్య ఉపశ మిస్తుంది.

 



Recent Stories







bpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE