• HOME
  • అందం
  • నాజూకైన నడుముకు.. నవీన ఆభరణం

గతంలో అబ్బాయిలు మాత్రమే వాడే బెల్ట్ ఇటీవలి కాలంలో అమ్మాయిలూ వాడుతున్నారు. ధరించే డ్రెస్, వ్యక్తిగత అభిరుచులకు తగిన రకారకాల బెల్టులను అమ్మాయిలు వస్త్రధారణలో భాగంగా చేసుకుంటున్నారు. మనకు కాస్త కొత్త అయినా పాశ్చాత్త్య దేశాల్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. వయసు, సందర్భం, శరీర ఛాయ, వేసుకున్న దుస్తులకు నప్పే పలు రకాల బెల్టులు  ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి ఎలాంటి దుస్తులకు బెల్ట్ అదనపు అందాన్ని తెస్తుంది? వంటి ప్రశ్నలకు ఫ్యాషన్ నిపుణులు ఇస్తున్న సూచనలేమిటో తెలుసుకుందాం.

  • కొత్త బెల్ట్ నడుము సైజు కంటే 5 అంగుళాలున్నది చాలు. మరీ పెద్దగా ఉంటే బాగుండదు.  
  • ప్యాంట్‌ రింగ్స్, బెల్ట్ వెడల్పు తగిన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.
  • సాధారణంగా జీన్స్, మిడ్డీల మీదకి బెల్ట్స్ చక్కగా నప్పుతాయి.
  • కురచగా ఉండే టాప్, ఒంటికి అతికినట్లుండే జీన్స్, ఫ్రాక్‌ మీదకి రిబ్బన్‌ బెల్టు ఉంటే అదనపు అందం చేకూరుతుంది.
  • టీషర్టు, జీన్స్ కాంబినేషన్ మరింత అందంగా ఉండాలంటే వెడల్పుగా ఉండే బెల్ట్ వాడాల్సిందే.
  • ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వేసుకునే ఫార్మల్ పాంట్ , లేత జీన్స్ మీదికి నలుపు లేదా ముదురు గోధుమ రంగు బెల్టులు నప్పుతాయి.
  • సన్నగా, మృదువుగా వుండే బెల్టులు ఎలాంటి డ్రెస్ మీదికైనా బాగుంటాయి.
  • బిగుతుగా ఉండే సై్టలిష్‌ వేర్‌కు అంత కన్నా సై్టల్‌గా ఉండే ఎంబ్లిషిడ్‌ బెల్‌‌డ బాగుంటుంది. ఇవి రకరకాల రంగుల్లో, సైజుల్లో లభిస్తాయి.
  • నలుగురిలో ప్రత్యేకంగా, పోష్ లుక్ తో కనబడాలంటే పెద్ద సైజు బకిల్‌ ఉన్న బెల్ట్ వాడాలి.
  • దుస్తుల రంగుకు భిన్నమైన, తేలికపాటి రంగులున్న బెల్టులు బాగుంటాయి.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE