• HOME
 • అందం
 • తుమ్మెద రెక్కల్లాంటి కురుల కోసం..

పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు అందానికి ప్రతీక. ఎంత మంచి ఛాయ, శరీరాకృతి ఉన్నా అందుకు తగిన కురులు లేకపోతే అది అందం అనిపించుకోదు.పదిమందిలో ఉన్నా పొడవైన జడకుండే గుర్తింపు వేరేగా ఉంటుంది. అయితే నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లు, తరచూ వాడే షాంపూలు, రంగుల వినియోగం వంటి కారణాల మూలంగా జుట్టు సహజ శోభను కోల్పోయి నిర్జీవంగా మారుతోంది. దీంతో నిండా 25 ఏళ్ళు నిండని మహిళలు సైతం ఈ సమస్య కారణంగా వయసు పైబడినవారిగా కనిపిస్తుంటారు. సహజ శోభను కోల్పోయిన జుట్టుకు జవసత్వాలు అందించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకొంటే వీలున్నంత మేరకు ఈ సమస్యను నివారించవచ్చు.

గృహ వైద్యం

 • పొడిబారి, చిట్లిన జుట్టుకు తగినంత తేమను అందించినప్పుడే అది కోలుకుంటుంది. అందుకే గోరువెచ్చని కొబ్బరి, ఆలివ్ లేదా బాదం వంటి నూనెల్లో ఏదో ఒకదానినిని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, మర్దన చేయాలి. అరగంట తర్వాత కుంకుడు రసంలో మందార ఆకులు వేసి కలిపిన రసంతో అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. వారానికి కనీసం 2 సార్లు ఇలా చేయాలి.
 • పండిన బొప్పాయి గుజ్జుకు అంతే మొత్తం పెరుగు కలిపి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తేమ కోల్పోయిన జుట్టుకు జీవం లభిస్తుంది.
 • తలస్నానం తర్వాత కండిషనర్ వాడే బదులుగా కప్పు తేనెలో 2 చెంచాల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించి పావుగంట తర్వాత నీటితో కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.
 • చెంచాడు తేనె, గుడ్డు తెల్ల సొన కలిపి గిలకొట్టి దానికి 3 చెంచాల ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఇతర జాగ్రత్తలు

 • ఘాటైన రసాయనాలున్న చౌకబారు షాంపూల వినియోగం జుట్టు సహజత్వాన్ని కోలుకొని రీతిలో దెబ్బతీస్తుంది. అందుకే చర్మ స్వభావం, జీవన శైలి తదితర అంశాలను పరిగణన లోకి తీసుకొని తగిన షాంపూలను ఎంపిక చేసుకోవాలి.
 • వారానికి 2 సార్లు షాంపుతో తలస్నానం చేయెచ్చు తప్ప రోజూ చేస్తే జుట్టు పొడిబారిపోతుంది.
 • తలస్నానానికి వేడినీటి బదులు గోరువెచ్చని లేక చల్లని నీటినే వాడటం మంచిది.
 • తడి జుట్టును మెత్తని తువ్వాలుతో ఓపికగా తుడుచుకొని, ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరనిచ్చి దువ్వుకోవాలి. త్వరగా ఆరాలనే తొందరలో తరచూ హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడితే జుట్టు దెబ్బతినక మానదు.
 • డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్ మిషన్స్ వాడాల్సిన తప్పని పరిస్థితిలో వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి ఆ తర్వాత మాత్రమే వాటిని వాడాలి.
 • 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవటం ద్వారా వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టవచ్చు.
 • చిక్కుబడిన జుట్టును ముందుగా వేళ్ళ సాయంతో పాయలుగా విడదీసి తర్వాత నెమ్మదిగా దువ్వెనతో దువ్వుకోవాలి.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE