• HOME
  • అందం
  • వంటింటి దినుసులతో సౌందర్యం

పాదాల పగుళ్ళు

  • పగిలిన మడమలు, పాదాలకు వారం రోజుల పాటు రోజూ మగ్గిన అరటి పండు గుజ్జును పాదాలకు మర్దన చేసి అరగంట తర్వాత నీటితో కడిగితే సమస్య నయమవుతుంది.
  • చెంచా త్రిఫల చూర్ణం, అరచెంచా పసుపు, తగినన్ని నీళ్ళు కలిపి ముద్ద చేయాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొనిపాదాలకు బాగా పట్టించి ఉదయం లేచాక కడుక్కుంటే పగుళ్ళు తగ్గుతాయి.ఇలా వారం రోజుల పాటు చేయాలి.

మొటిమల నివారణ

  • చెంచా కస్తూరి పసుపు ముద్దకు, అరచెంచా నువ్వుల నూనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
  • మూడు పూటలా బటాణీ గింజ సైజు వేపాకు ముద్ద మింగితే ఎన్ని క్రీములు వాడినా వదలని మొటిమలు సైతం వదిలిపోతాయి.
  • చెంచా చొప్పున నిమ్మ రసం, పాలుకలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల మచ్చలు పోతాయి.

 చర్మ సమస్యల నివారణ

  • చెమట, కాలుష్యం, పేలుకారణంగా ఇన్ఫెక్షన్ ఏర్పడి తల మీద కురుపులు, పుండ్లు పడితే చెంచా వేపనూనె, 10 గ్రాముల కర్పూరం కలిపి మాడుకు పట్టిస్తే పేలు నశించటమే గాక పుండ్లు, కురుపులు పూర్తిగా మాడిపోతాయి.
  • గజ్జి బాధితులు గుప్పెడు వేపాకు, చెంచా పసుపు, చెంచా ఉప్పు దంచి ముద్దజేసి గజ్జి కురుపుల మీద రుద్ది గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు మానిపోతాయి.



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE