రుచికి ఎంతో బాగుండే టమోటో మహిళల సౌందర్య పోషణకూ ఎంతో దోహద పడుతుంది. చౌకగా, ఏడాది పొడవునా లభించే టమోటా సౌందర్య పరిరక్షణకు ఎంతగా మేలుచేస్తుందో తెలుసుకుందాం.

 

  • రెండు చెంచాల టమోటో గుజ్జు, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మపు ఛాయ మెరుగుపడటమే గాక చర్మానికి తగినంత తేమ అందుతుంది.
  • ఎండకు కమిలిన చర్మానికి రెండు చెంచాల టమోటా రసం, 4 చెంచాల మజ్జిగ కలిపి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
  • టమోటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మంపై మీద పేరుకున్న మురికి తొలగిపోతుంది.
  • టమోటా గుజ్జుకు కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే జిడ్డు వదిలిపోతుంది.
  • చెంచా టమోటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది.
  • టమోటో గుజ్జుకు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కొంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
  • ఆలివ్ ఆయిల్, టమోటో గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే సాగిన చర్మం బిగుసుకుంటుంది.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

మహిమాన్విత క్షేత్రం.. మంత్రాలయం

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాల్లో మంత్రాలయం ముఖ్యమైనది. 

MORE