కూరల్లో, చారుల్లో కరివేపాకును ఎంత శ్రధ్ధగా వేస్తామో తినేసమయంలో అంతే నిర్లక్షంగా దాన్ని తీసిపారేస్తాం. కానీ కరివేపాకు ఉపయోగాలు గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం దాన్ని తినకుండా ఉండలేము. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది.కరివేప ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అతివల అందంలో కీలక పాత్ర పోషించే కురుల అందాన్ని రెట్టింపు చేయటంలోనూ ఉపయోగపడుతుంది. జుట్టు నెరవకుండా చేయటంలో దీన్ని మించిన ఔషధం లేదు. కురుల అందానికి కరివేపాకు ఎలావాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • రోజూ నాలుగైదు పచ్చి కరివేపాకులుతిన్నా లేదా కనీసం కూరల్లోని ఆకు వదిలిపెట్టకుండాతిన్నా జుట్టు నెరిసిపోదు.
  • కొబ్బరినూనెలో తగినన్ని కరివేప ఆకులను వేసి మరిగించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్‌చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినూనెలోని ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు కేశాలు చిట్లకుండా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.
  • కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతిపిండి కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఇలా చేస్తే 2 నెల్లల్లో తెల్లజుట్టు నలుపుకు తిరుగుతుంది.
  • కరివేపాకు, గింజ తీసిన పచ్చి ఉసిరికాయ, మందార పువ్వుల్ని గుప్పెడు చొప్పున తీసుకొని 2చెంచాల నీరు చల్లి రుబ్బుకొని ఆ గుజ్జును తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.
  • గోరింటాకు, కరివేపాకు, మందార ఆకులు, కుంకుడు కాయలు గుప్పెడు చొప్పున కలిపి కప్పు నీరు పోసి రాత్రి నానబెట్టి ఉదయాన్నే మరోమారు కలిపి తలకు పట్టించి చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిలా మెరుస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE