• చలికాలంలో చర్మం పొడిబారి కళావిహీనంగా మారుతుంది. ముఖ్యంగా చలితీవ్రతకు గురయ్యే కాళ్ళు, చేతులు తెల్లగా మారతాయి.ఈ పరిస్థితిని నివారించాలంటే చెంచా చొప్పున తేనె, కొబ్బరినూనె, నిమ్మరసంతీసుకుని కలిపి స్నానానికి ముందు చేతులకు, కాళ్లకు,రాసి 10 నిమిషాల తర్వాత సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పూర్వస్థితికి వస్తుంది.
  • చలికి దెబ్బతిని ముడతలు పడిన ముఖ చర్మానికి చెంచా గ్రుడ్డు తెల్లసొన, అరచెంచా నిమ్మరసం, పావు చెంచా బరకగా చేసిన బాదంగింజల పొడికలిపిన మిశ్రమంతో మర్దన చేసి పాక్ వేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే వారానికి ముఖంమీది ముడతలు మటుమాయం అవుతాయి. తెల్లసొన ఎప్పుడు రాసుకున్నా గోరువెచ్చని నీటితోనే కడగాలి. లేదంటే ముఖం రోజంతా నీచువాసన వస్తుంది.
  • చెంచా చొప్పున చిక్కటి కొబ్బరిపాలు, రోజ్ వాటర్, నిమ్మరసం తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మొటిమల మచ్చలు మాయం అవుతాయి.
  • మొటిమలతో బాధపడేవారుచెంచా చొప్పునపచ్చిపాలు, తేనె కలిపి దానికి చిటికెడు పసుపు జోడించి మునివేళ్ళతో ముఖానికి,మెడకు రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మొటిమల నివారణతో బాటు ముఖంమీది ముడతలు కూడా పోతాయి.
  • వారానికి 3 సార్లు బంగాళదుంపను సగానికి కోసి దాన్ని ముఖం మీద రుద్ది అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొంటే మచ్చలు పోయి చర్మం నున్నగానిగనిగలాడుతుంది. కంటి కింది నల్లని చారలు కూడా తొలగిపోతాయి.
  • చెంచా కలబంద గుజ్జు ( అలోవేరా)కు చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్నిముఖం మీద గోధుమరంగు మచ్చలకు రాసి బాగా మర్దన చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే ఆ మచ్చలుతొలగిపోయి క్రమంగా చర్మం మునుపటిలా సహజంగా మారుతుంది.
  • చెంచా తేనెకు, అర చెంచా నిమ్మరసం, పావుచెంచా పసుపు కలిపి ముఖానికి,మెడకు పట్టించి ఆరాక కడిగేస్తే ముఖం, ముక్కు మీద పేరుకున్న బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ ,మచ్చలు తొలగి చర్మం చక్కని రంగుతో నిగారింపుగా కాంతులీనుతుంది.
  • పొడిబారిన ముఖ చర్మానికి చెంచా చొప్పున పెరుగు, మెంతిపొడి కలిపి దానికి అరచెంచా తేనె బాగా రంగరించి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే తేమ కోల్పోయిన చర్మం తిరిగి తాజాగా కళకళలాడుతూ కాంతివంతంగా మారుతుంది.
  • వారానికి 3 సార్లు బంగాళదుంపను సగానికి కోసి దాన్ని ముఖం మీద రుద్ది అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొంటే మచ్చలు పోయి చర్మం నున్నగానిగనిగలాడుతుంది. కంటి కింది నల్లని చారలు కూడా తొలగిపోతాయి.
  • చెంచా కలబంద గుజ్జు ( అలోవేరా)కు చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్నిముఖం మీద గోధుమరంగు మచ్చలకు రాసి బాగా మర్దన చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే ఆ మచ్చలుతొలగిపోయి క్రమంగా చర్మం మునుపటిలా సహజంగా మారుతుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE