• HOME
  • అందం
  • నల్లనమ్మాయిల  మేకప్ చిట్కాలు

 

అందం, నలుపు రెండూ పరస్పరం విరుద్ధమైనవనేది పాత మాట. ఇప్పటి రోజుల్లో నలుపే రంగులకు రాణిగా, అసలైన అందానికి ప్రతీకగా చెల్లుబాటు అవుతోంది. పత్రికల పతాక శీర్షిక నుంచి, ఫాషన్ పెరేడ్  వరకు నలుపే రాజ్యమేలుతోంది. ఇప్పుడు  తెల్లగా మెరిసే అమ్మాయిలకంటే చామన ఛాయ  వారే గ్లామర్ రంగంలో రాణిస్తున్నారు. మేకప్  మీది సరైన అవగాహన ఉంటే నల్లని అమ్మాయిలు సైతం ఇంట్లోనే చక్కగా తమ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. 

దశలు       

నల్లని, చామన ఛాయ  ఉన్న అమ్మాయిలు ముందుగా తమ ముఖ ఆకృతి, ఒంటి రంగు, వేసుకోబోయీ డ్రెస్, హాజరవుతున్న ఫంక్షన్, సమయం తదితర అంశాల ను పరిగణనలోకి తీసుకుని, కింద చెప్పినట్లుగా దశల వారీగా మేకప్ వేసుకోవాలి.

ఫౌండేషన్ : మేకప్ లో  మొదట ఫౌండేషన్ వేసుకోవాలి. ఒంటి రంగుకు అనుగుణమైన రంగుని దీనికి  ఎంపిక చేసుకోవాలి. అన్ని రక్కల శరీర చాయా వారికీ నప్పే అనేక  ఫౌండేషన్ క్రీమ్ లు  ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నాయి. క్రీం బాగా కలుపుకోవటంతో బాటు సమంగా వేసుకోవటాన్ని బట్టే మేకప్ చక్కగా కుదురుతుంది.

కాన్సిలర్ : ఫౌండేషన్ ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే ఆ భాగంలో నారింజ లేక ఎరుపు రంగులు వాడి, ఎక్కువైన నలుపును తగ్గించాలి. కాన్సిలర్ వేసిన తర్వాత తేలికగా పౌడర్ అడ్డుకోవటం మరువొద్దు.

బ్లష్ : నల్లని వారి బుగ్గల మీద నారింజ, పగడపు ఎరుపు, నిండు కుంకుమ వంటి రంగులతో బ్లష్  చేసుకోవాలి. దీనివల్ల ఆ భాగాలలోని మచ్చలు, చారికలు బయటకు కనిపించకుండా చూసుకోవచ్చు.

లిప్ స్టిక్ : నల్లని, చామన ఛాయ వారు బర్గుండీ, గోధుమ రంగులతో బాటు ఎరుపు రంగు లిప్ స్టిక్ చక్కగా నప్పుతుంది. లిప్ స్టిక్ తో బాటు లిప్ లైనర్  కూడా వాడాలి. అయితే మరీ నిండు రంగు కాకుండా లేత రంగులను ఎంపిక చెసుకొవాలి. లేత గులాబి, ఇతర లేత రంగుల వల్ల  పెదవులు ఉబ్బినట్లు కనిపిస్తాయి గనుక ఆ వెంటనే లిప్ గ్లాస్ వాడితే పెదవులు తాజాగా కనిపిస్తాయి.

లిప్ లైనర్: నోటి ఆకారం, పరిమాణాన్ని బట్టి   లిప్ లైనర్ ఎంపిక చేసుకుంటే పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి. చప్పిడి పెదాలు, గుంటలు పడ్డ పెదాలున్న వారునల్లని అమ్మాయిలు  లేత రంగు లిప్ లైనర్ వాడాలి .

ఐ షేడ్ : కను బొమ్మలు, కను రెప్పల మధ్య, కంటి కింది భాగంలో ఐ సహదే వాడితే  కంటి అందం రెట్టింపు అవుతున్ది. మరీ నిండు రంగులు, లేత రంగులు, మెరిసే  రంగులకు బదులుగా నిండు గోధుమ రంగు, నిండు బంగారు రంగు, గ్రీన్, బచ్చలి పండు రంగులు వాదొచ్చు. స్మోకీ లుక్ కావాలనుకుంటే, కంటి మదతలకు నిండు రంగులు వాదాలి. బూడిద రంగు, బ్రౌన్ వంటి రంగుల వాళ్ళ సరికొత్త లుక్ సాధ్యమవుతుంది

 



Recent Stories







bpositivetelugu

కంప్యూటర్‌ గేమ్స్‌ మితిమీరితే ఇబ్బందే

ఇప్పటి పిల్లలకు కంప్యూటర్‌ గేమ్స్ అంటే ప్రాణం. ఈ గేమ్స్ ప్రమాదాలకు తావులేని, చెప్పలేనంత వినోదం కలిగించే మాట నిజమే అయినా పిల్లలు ఎక్కువ సమయం

MORE
bpositivetelugu

మోక్షమాసం.. మార్గశిరం  

మన పంచాగం ప్రకారం మార్గశిరం.. తొమ్మిదవ నెల. విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసమిది. మాసానాం మార్గ శీర్షోహం అని

MORE