• HOME
 • అందం
 • మండే వేసవిలో చర్మ సంరక్షణ

ఇతర కాలాలతో పోల్చితే వేసవిలో చర్మసౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. ప్రతిఒక్కరూ ఎంతోకొంత సమయం వృత్తివ్యాపకాల్లో భాగంగా ఎండలోకి వెళ్ళటం తప్పదు గనుక అందరూ ఈ వేసవిలో చర్మ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం ఎంతైనా అవసరం. నిపుణులు సూచిస్తున్న ఈ జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ వేసవిలో చర్మ సౌందర్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

 • వేసవిలో సహజంగానే శరీరంలోని తేమ తగ్గిపోవటం ఎక్కువ. ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. అందుకే.. ఎండలోకి వెళ్ళటానికి ముందు ముఖం, మెడ, చేతులకు రోజ్ వాటర్‌ రాసి, ఆ తర్వాత వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచిది.
 • ఎండలో తిరగటం వల్ల చర్మం బాగా పొడిబారుతుంది మాటిమాటికీ సబ్బుతో కడిగితే చర్మం మీది సహజసిద్ధమైన తైలాలు హరించుకుపోయి, మరింత పొడిబారుతుంది. కనుక వేసవిలో సబ్బు వినియాగానికి బదులు చల్లని నీటితో కాళ్ళు, ముఖం కడుక్కోవాలి.
 • భరించలేని వేడి, ఉక్కపోత, చెమట కారణంగా వేసవిలో దాహంతో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకూ నీరు తాగుతూనే ఉండాలి. లేకుంటే ఆ ప్రభావం చర్మ ఆరోగ్యం మీద పడకమానదు.
 • వేసవిలో మధ్యాహ్నపు ఎండలో అతినీలలోహిత కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీసి చర్మం ముడతలు పడేలా చేస్తాయి. అందుకే ఈ సీజన్లో మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ ఎండలో తిరగకపోవటమే మంచిది. తప్పక వెళ్లాల్సి వస్తే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను ఎండతగిలే చోట రాసు కోవాలి.
 • వేసవిలో లేత రంగుల పల్చటి కాటన్ దుస్తులు వాడటం మంచిది. ఈ సీజన్లో దుస్తులు ఒంటిని కప్పేలా ఉండేలా చూసుకోవటం ద్వారా ఎండా ప్రభావాన్ని అధిగమించవచ్చు. ఎండలో బయటకి వెళ్ళేటప్పుడు టోపీ లేదా గొడుగు వాడడం మరచిపోవద్దు.
 • వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవటంతో బాటు పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచాలి. మసాలా తగ్గించుకోవటంతో బాటు పగటివేళల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.
 • ఈ వేసవిలో రోజుకు కనీసం ఒక గ్లాసు చొప్పున మజ్జిగ, పండ్లరసం, రాగి జావ, సబ్జాగింజల నీరు తీసుకోవాలి. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
 • ఏసీలో ఉండేవారు బయటికి వెళ్లాల్సి వస్తే నేరుగా ఎండలోకి వెళ్లకుండా కాసేపు ఏసీ నుంచి బయటికి వచ్చి నీడలో నిలబడి ఆ తర్వాత వెళ్ళాలి. అలాగే బయటినుంచి రాగానే నేరుగా ఏసీలోకి వెళ్లకుండా కాస్త ఆగి ఏసీ ఆన్ చేయాలి.
 • వేసవిలో ఎండ కారణంగా ముఖం మంటగా ఉంటే ఐస్‌ ముక్కతో ముఖం మర్దన చేసుకుని మాయిశ్చరైసర్ రాసుకోవాలి.
 • వేసవిలో టమాటా, కీరా ముక్కలతో రుద్దుకొంటే ముఖ చర్మం మీద చేరిన జిడ్డు వదిలిపోతుంది.
 • వేసవిలో జుట్టును కురచగా కత్తెరించుకోవటం వల్ల సౌకర్యంగా ఉండటమే గాక ఎండా ప్రభావాన్ని కూడా తగ్గించగలము. వేసవిలో రాత్రివేళ నూనె రాసుకొని ఉదయాన్నే తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవటం అవసరం. అలాగే హెన్నావినియోగం కూడానా రక్షణ కల్పిస్తుంది.
 • వేసవిలో ఈత కొట్టేవారు నీటిలోని క్లోరిన్ శాతాన్ని గమనించాలి. లేకుంటే కేశ సౌందర్యం దెబ్బతింటుంది. ఈత కొట్టేటప్పుడు తలకు మాస్క్ పెట్టుకొంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు.

వేసవిలో రెండుపూటలా చన్నీటితో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు స్క్రబ్బర్‌లను బదులు చేతులతోనే ఒళ్ళు రుద్దుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE