• HOME
  • అందం
  • హెయిర్ ప్లాంటేషన్ మంచిదేనా?

జుట్టు రాలిపోతోందంటే ఎవరికైనా తెలియని ఆందోళన. తండ్రి, తాతల్లో ఎవరికైనా బట్టతలా వుంటే ఈ కంగారు మరింత ఎక్కువవుతుంది. సమస్య తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా తీవ్రమైన ఆత్మనూన్యతా భావం ఏర్పడి నలుగురిలోకి వెళ్ళలేని పరిస్థితి. పెళ్ళికాని వారిలో అయితే ఈ ఆందోళన ఏ స్థాయిలో వుంటుందో మాటల్లో చెప్పలేము.   సాధారణంగా నలభై, యాభై  ఏళ్ళ వయసు వచ్చే సరికి జుట్టు రాలటం ఎక్కువగా ఉండేమాట నిజమే అయినా జన్యుపరంగా సమస్య ఉన్నవారిలో మాత్రం ఇరవై ఏళ్ళకే  జుట్టు రాలటం మొదలవుతుంది. ఇది పురుషుల సమస్య గానే చాలామంది అనుకుంటారు గానీ ఇది మహిళల్లోనూ కనిపిస్తుంది. ఈ సమస్యకు ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ వంటి పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో వచ్చిన నేపధ్యంలో దానికి సంబంధించిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

ఎవరికి అవసరం

 ఇరవై ఏళ్ళలోపు జుట్టు ఊడుతున్నవారికి, అప్పుడప్పుడే జుట్టు ఊడటం మొదలైనవారికి సాధారణంగా వైద్యులు మందులతోనే సమస్యను పరిష్కరించేందుకు చూస్తారు. మిగిలిన వారి సమస్యను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే వైద్యులు హెయిర్ ప్లాంటేషన్ ను సూచిస్తారు.

అపోహలు

హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటే మెదడు పనితీరు దెబ్బ తింటుందనీ, జీవితాంతం మందులు వాడాల్సిందేననీ అపోహ పడతారు. కానీ వీరు వారం రోజులపాటు వైద్యులు సూచించిన మందులతో బాటు ఆరు నెలల పాటు మల్టీ విటమిన్ మాత్రలు వాడితే చాలు.  కొందరు ఇతరుల వెంట్రుకలనే తమకు అతికిస్తారనీ  పొరబాటు పడుతుంటారు. అయితే దట్టంగా జుట్టు ఉన్న చోట ఉండే జుట్టును కుడుల్లతో సహా తీసి, దానిని పల్చగా ఉన్న చోట  నాటుతారు.ఈ చికిత్స కేవటం బట్ట తల సమస్య ఉన్న వారికే గాక మీసాలు, గడ్డాలు, కనుబొమ్మల వంటి భాగాలలో జుట్టు లేనివారికీ ఉపయోగపడుతుంది.

చికిత్స దశలు

వెంట్రుకలను వేరు చేయటం: మాడు మీది జుట్టును పొరలు పొరలుగా తీసి వెంట్రుకలు లేనిచోట  నాటటం. దీన్ని స్ట్రిప్ విధానం అంటారు. ఇప్పటికీ నూటికి తొంభై మంది వైద్యులు ఈ విధానాన్నే అమలు చేస్తున్నారు. రెండో పద్దతి ఫోలిక్యులార్ యూనిట్ రీప్లేస్మెంట్. ఇందులో ఒక్కో వెంట్రుకనూ కుదితితో సహా పీకి వేరే చోట నాటుతారు. నొప్పిలేకుండా ఉండేందుకు మత్తు ఇచ్చి ఈ చికిత్స చేస్తారు గనక భయపడాల్సిన పనిలేదు. 

గ్రాఫేట్లను రెడీ చేయటం: మైక్రో స్కోప్ లో చూసి  జుట్టును నాటేందుకు గ్రాఫేట్లను సిద్దం చేసే దస ఇది. 

జుట్టు నాటటం: చిన్న చిన్న కత్తులు, సూదులతో రంధ్రాలు చేసి అక్కడ జుట్టును నాటుతారు. జుట్టు ఎటు వైపు వాలి ఉండాలి, అన్ని చోట్లా సమంగా జుట్టు అమరుతోందా అని చూసుకుంటూ జుట్టును సమంగా నాటుతారు. ఈ మొత్తం పనికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. బ్లీడింగ్ వంటి సమస్యలేమీ ఉండవు. 

చికిత్స తర్వాతి జాగ్రత్తలు

  • చికిత్స తర్వాతి ౩ రోజులూ నీడపట్టున ఉండాలి
  • తలను శుభ్రంగా ఉంచుకోవాలి
  • చికిత్స తర్వాత రెండు నెలల వరకూ జుట్టు రాలి ఆ తర్వాత పెరుగుతుంది. అందుకే అనవసరంగా కంగారు పడొద్దు
  • చికిత్స తర్వాత రెండు వారాలు చేమతపట్టేలా వ్యాయామం చేయగూడదు. దీనివల్ల దురద పెట్టి గోకటం వాళ్ళ జుట్టు రాలుతుంది
  • నీటిలోని క్లోరిన్ వాళ్ళ నాటిన జుట్టు దెబ్బతింటుంది గనుక నెల రోజుల వరకు ఈత కొట్ట కూడదు.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE