ఈ రోజుల్లో మహిళల్లో కనిపించే ప్రధాన కేశ సమస్య.. విపరీతంగా జుట్టు రాలటం. ఈ సమస్యకు హార్మోన్ ల అసమతుల్యత, అధిక మోతాదులో రసాయనాలున్న షాంపూలు, ఆయిల్స్ వినియోగం, ఫంగల్ ఇన్ఫెక్షన్, వంటి కారణాలతో బాటు మానసిక ఒత్తిడి, ఆహారపరమైన మార్పులు కూడా ఈ సమస్యకు ఇతర కారణాలుగా ఉన్నాయి. ఇక.. చుండ్రు ఈ సమస్యకున్న మరో ప్రధాన కారణం. కారణాలు ఏవైనా ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలటాన్ని నిరోధించటమే గాక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. 

ఇవీ చిట్కాలు

  • నూనె రాయని వారిలో కేశాలు పొడిబారి నిర్జీవంగా మారి తెగి, రాలిపోతాయి. అందుకే.. నెలలో కనీసం 4 సార్లైనా గోరువెచ్చని బాదం,ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి.
  • ఒక గిన్నెలో 6 చెంచాల నూనె, అరా చెంచా మెంతులు తీసుకొని సన్నని సెగ మీద 5 నిమిషాలు ఉంచి ఆరనిచ్చి, ఆ గోరువెచ్చని నూనెను మునివేళ్ళతో మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ జుట్టు రాలటం ఆగి, కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
  • తీసుకొనే ఆహారంలో ఐరన్ తగ్గినా జుట్టు రాలుతుంది గనుక తరచూ ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదం పప్పులతో బాటు లివర్ మరియు రొయ్యలు తీసుకోవాలి. దీనివల్ల తగినంత ఐరన్ అంది జుట్టు రాలటం ఆగుతుంది.
  • వారానికి రెండు సార్లైనా మంచి కండీషనర్ తో తలస్నానం చేయడం వల్ల దుమ్ము, ధూళి తొలగి చుండ్రు చేరదు. దీనివల్ల జుట్టు రాలటమనే సమస్య తలెత్తదు.
  • రోజూ ఓ గ్లాసు తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలటం బాగా తగ్గుతుంది.
  • ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తలను కప్పేలా చున్నీ ధరించటం వల్ల జుట్టు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. దీనివల్ల జుట్టు రాలటం తగ్గుతుంది.
  • హెయిర్ క్లిప్స్ లేదా బ్యాండ్స్ తో జుట్టును గట్టిగా మెలిపెట్టి కట్టటం వల్ల జుట్టు రాలుతుంది గనుక వదులుగా మాత్రమే కట్టాలి.
  • జుట్టు స్వభావానికి తగిన షాంపూను మాత్రమే ఎంపిక చేసుకొంటే జుట్టు రాలటం వంటి సమస్య రాదు.
  • కేశాలకు అధికంగా జెల్ లేదా స్ప్రే వాడినప్పుడు జుట్టు దెబ్బతిని తెగిపోయే ముప్పు ఎక్కువ. కనుక వాటిని వాడిన తర్వాత తప్పక వెంటనే తలస్నానం చేయాలి. Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE