• HOME
  • అందం
  • అవాంఛిత రోమాల నియంత్రణ కోసం..

    అమ్మాయిల అందాన్ని దెబ్బతీసే అంశాల్లో అవాంచిత రోమాల సమస్య ఒకటి. వీటి వల్ల ముఖం అందవికారంగా కనిపించటమే గాక మహిళలు మానసికంగా కుంగిపోతారు. ఈ రోమాలు ఒకటీ రెండుగా మొదలై ఒక్కసారిగా పెరుగుతాయి. వైద్య పరిభాషలో వీటిని 'హిర్స్యుటిస్మ్' అంటారు. కొందరిలో శరీరతత్వం మూలంగా, మరికొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య రావచ్చు. మహిళల్లో పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) కూడా ఈ సమస్యకున్న మరో కారణం. ఎడ్రినల్‌ గ్రంథి పనితీరులో వచ్చే మార్పులూ ఈ సమస్యకు దారి తీయొచ్చు. కొన్నిరకాల మందులతోనూ అవాంఛిత రోమాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్‌, వక్షోజాల్లో ఫైబ్రో ఎడినోసిస్‌ సమస్య ఉన్నప్పుడు వాడే మందులూ అవాంఛిత రోమాలు పెరిగేందుకు దోహదపడతాయి. హార్మోనుల అసమతుల్యత వల్ల తలెత్తే ఈ సమస్యను కొన్ని చిట్కాల సాయంతో వదిలించుకోవచ్చు. అవి... 

  • వారం పాటు రోజూ పాలలో పసుపు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగేస్తే రోమాలన్నీ తొలగిపోతాయి.
  • ఓ అరటి పండు గుజ్జు, 2 చెంచాల ఓట్‌మీల్‌ కలిపి ఆ మిశ్రమాన్ని రోమాలా మీద రాసి 20 నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ రుద్ది కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది.
  • నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనెను గాఅవాంఛిత రోమాలపై రాసి, మర్ధన చేసి మెత్తని శెనగ పిండిని రాసి బాగా నొక్కి నలుగు పెట్టాలి. వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
  • స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు రాసుకొని రుద్ది కడుగుతుంటే ఈ అవాంఛిత రోమాల బెడద తగ్గుతుంది.
  • గుడ్డు తెల్ల సొనలో చెంచా మొక్కజొన్న పొడి కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి నీటితో కడిగితే ఒంటిమీది అవాంఛిత రోమాలు సులభంగా తొలగిపోతాయి.
  • శనగపిండి, పసుపును సమపాళ్లలో కలిపి ముఖానికి ఫేషియల్ మాదిరిగా పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే రోమాలపెరుగుదలను నియంత్రించవచ్చు.
  • ఆహారంలో పైటోఈస్ట్రొజన్స్ ఉండేలా చూసుకొంటే హార్మోనుల సమస్యలు తొలగి అవాంఛిత రోమాల సమస్యే రాదు. అందుకే తరచూ ఆహారంలో అవిశ గింజలు, సోయా, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, వెల్లుల్లి, ఎండు ఖర్జూర, టోఫు వంటివి ఉండేలా చూసుకోవాలి



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE