కళాకారులు, ఆతిథ్య రంగంలో పనిచేసే మహిళలు సాధారణంగా రోజూ తలస్నానం చేస్తుంటారు. కొందరు జిడ్డు చర్మం కారణంగా రోజూ తలస్నానం చేస్తుంటారు. దీనివల్ల కొన్నాళ్ళకు షాంపూల ప్రభావం ఎక్కువై మాడుపై ఉండే సహజనూనెలు పోయి జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత లేదా పీహెచ్ 5.5. ఉన్న నాణ్యమైన షాంపూతో రోజు విడిచి రోజూ లేదా రెండు రోజులకోసారి చేయడం మంచిది. దీనితోబాటు కనీసం వారానికోసారైనా గోరువెచ్చని స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకోవడం తప్పనిసరి. స్టయిలింగ్ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్ వాడటం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్లకు తగిలేలా రాయటం చేస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. ముందు జుట్టును శుభ్రంగా తుడుచుకొని ఆరినతర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొని ఆ తర్వాతే జెల్స్ రాయాలి. అలానే జుట్టు మరీ అట్టలా ఉన్నప్పుడే స్టయిలింగ్ చేయకపోవడం మంచిది.