• HOME
  • అందం
  • జిడ్డుగారే చర్మానికి...

 ఎండలు మండి పోతున్నాయి. ఉదయం పది గంటలకే ఉక్కపోత, చెమటలు పత్టటం వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ఈ వాతావరణం జిడ్డు  చర్మం గలవారిని మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. ఈ వేసవిలో జిద్దుగారే చర్మానికి ఉపసంనాన్ని కలిగించే కొన్ని చిట్కాలు..

  • జిడ్డు చర్మం ఉన్నవారు పాలతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవటం వల్ల అక్కడి మురికి అంటా తొలగి పోవటమే గాక ముఖం తాజాగా మారుతుంది.
  • ఉక్కపోతతో సతమతమయ్యే ముఖ చర్మానికి తేనె చక్కని ప్రత్యామ్నాయం. ఇది అన్ని రకాల చర్మాల వారికీ పనికొస్తుంది. ముఖం,మెడ మీద తేనెను తేలికగా రాసి మర్దనా చేసి పావుగంట పాటు ఆరనిచ్చి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మానికుండే సహజ సిద్ధమైన నిగారింపును నిలుపుకోవచ్చు.
  • జిడ్డు చర్మం ఉన్నవారు అర చెంచా మంచి గంధం పొడిని 2 చెంచాల నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టేలా రాయాలి. ఓ పావు గంట పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేయటం వల్ల చర్మం తాజాగా మారటంతో బాటు కళ్ళ కింది నల్లని చారలు, వలయాలు తొలగిపోతాయి. ముక్కు, ముఖ భాగాలలో పేరుకు పోయిన నల్లని యాక్సిన్  కూడా తొలగిపోతుంది. 
  • చెంచాడు ముల్తానిమట్టికి నాలుగు చెంచాల రోజ్‌ వాటర్‌ని కలిపి ముఖం, మెడ మీద రాసుకొని బాగా ఆరనిచ్చి చల్లని నీటితో కడిగితే చర్మంలోని జిడ్డు తొలగిపోయి సహజ సిద్దంగా మారుతుంది.
  • నిమ్మరసం లేదా పెరుగుకు చెంచాడు గోధుమ పిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి ఆరనిచ్చి కడగటం వాళ్ళ ముఖం మీది జిడ్డు తొలగి పోవటమే గాక నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.

 Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE