• HOME
  • అందం
  • వేసవిలో చర్మ సంరక్షణకు  పుచ్చ

 

పుచ్చకాయలో కోరినంత పీచుతో బాటు మొత్తం బరువులో సుమారు 92 శాతం నీరు ఉంటుంది. అందుకే వేసవిలో చెమట, మూత్రం రూపంలో కోల్పోయే నీటిని పుచ్చకాయ తినటం ద్వారా భర్తీ చేసుకోవచ్చు. దీని వల్ల చర్మం తాజాగా కనిపించటమే గాక  ఎండ కారణంగా కోల్పోయిన సహజసిద్ధమైన నిగారింపును సంతరించుకుంటుంది. పుచ్చ గింజలను బరకగా రుబ్బి ముఖానికి పట్టిస్తే సరిపడా తేమ అంది ముఖం పొడిబారి పోదు. 

ఇతర ఉపయోగాలు

  • సూర్యరశ్మిలోని ప్రమాదకరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం నుంచి కాపాడుకోవాలంటే పుచ్చ, దోసకాయ గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించి అరగంట పాటు ఆరనిచ్చి కడగాలి. దీనివల్ల సూర్యరశ్మి వల్ల చర్మం కమిలి పోకుండా కూడా కాపాడుకోవచ్చు.
  • రోజూ పుచ్చ ముక్కలు తిన్నా, గుజ్జును ఒంటికి రాసుకున్నా అందులోని లైకోపిన్‌, సి, ఎ విటమిన్ల కారణంగా చర్మంపై ఏర్పడే గీతలు, ముడుతలు రావు. దీనివల్ల వయసు ప్రభావం కనబడదు.
  • పుచ్చ చర్మానికి సహజసిద్దమైన టోనర్‌గా పనిచేస్తుంది. వేసవిలోని ఎండల కారణంగా చెమట, జిడ్డు ఎక్కువకావటం సహజమే. ఇలాంటప్పుడు పుచ్చ ముక్కతో ముఖాన్ని సున్నితంగా అద్దితే ముఖం తేటపడుతుంది.
  • గుప్పెడు పుచ్చకాయ గుజ్జును అరచెంచా తేనెతో కలిపి చర్మానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగితే చర్మం నునుపుగా మారుతుంది.
  • మొటిమలు తగ్గడానికి పుచ్చకాయ మంచి మందుగా పనిచేస్తుంది. మొటిమలున్నవారు ముఖాన్ని శుభ్రంగా కడిగి పుచ్చ రసంలో ముంచిన దూదితో ముఖమంతా తుడిచి, పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
  • పగటిపూట ఎండకు తిరగటం వల్ల అలసి సొలసిన చర్మానికి ఏ రోజుకారోజు  తగిన ఉపశమనాన్ని అందించటం అవసరం. అందుకు పుచ్చకాయ గుజ్జు, పుదీనా ఆకులను ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్ లో ఉంచి గడ్డ కట్టించి, ఆ మంచు ముక్కలతో ముఖాన్ని తేలికగా రుద్దితే సరి.
  • పుచ్చకాయలో ఉండే సిట్రుల్లిన్‌ అనే ఫైటో న్యూట్రీయంట్‌ వల్ల శరీరంలో ఆర్జినిన్‌ అనే అమైనోయాసిడ్‌ పెరిగి, అది మాడులో రక్తపస్రరణ మెరుగుదలకు దోహద పడుతుంది. దీని వాళ్ళ కేశాలు చక్కగా పెరగటమే గాక జుట్టు కుదుళ్ళు బలపడతాయి.
  • పుచ్చగుజ్జులో కొద్దిగా శెనగపిండి కలిపి ముఖానికి పట్టిస్తే చక్కని స్క్రబ్బింగ్‌లా పనిచేసి ముఖ చర్మంలో దాగున్న మురికి, వ్యర్ధాలు వదిలిపోతాయి. ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్‌ హెడ్స్‌ కూడా తొలగిపోతాయి.
  • జిడ్డు చర్మం ఉన్నవారు పుచ్చ రసాన్ని రాసుకుంటే అందులోని విటమిన్‌ ఎ మూలంగా చర్మలోపలి తైల గ్రంధుల పనితీరు తగ్గి ముఖం పొడిగా, తాజాగా మారుతుంది.
  • పొడి చర్మం ఉన్నవారు పుచ్చ ముక్కలను తేనెలో ముంచి మర్దన చేసుకుంటే ముఖ చర్మానికి సరిపడా తేమ అందుతుంది.

 



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE