• HOME
  • అందం
  • అందమైన పాదాల కోసం పెడిక్యూర్

శరీరంలో ఎంతో శ్రమించే పాదాల గురించి మనం అంతగా పట్టించుకోము. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటేనో లేక ఎదురు దెబ్బ తగిలితెనో తప్ప సహజంగా వాటి ఊసు ఉండదు. కనీసం కాళ్ళు కడుక్కునే సమయంలోనూ వాటిని శుభ్రంగా కడగాలనీ అనుకోవటం తక్కువే. రోజంతా మన భారాన్ని మోసే పాదాలకు మొత్తంగా అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పొచ్చు. పాద రక్షలు వాడే అలవాటు లేకపోవటం, వాడే చెప్పులు సైతం పాదాలకు అనుకున్నంతగా రక్షననివ్వలేక పోవటం వల్ల పాదాలు రంగు మారటం, పగుళ్ళు ఇవ్వటం  వంటి మార్పులకు లోనవుతూ ఉంటాయి. అందుకే ఈ వేసవిలో పాదాల ఆరోగ్యం, పరిరక్షణ మీద ప్రత్యెక శ్రద్ధ అవసరం. ఈ ఇబ్బందులన్నిటికీ పెడిక్యూర్ చక్కని ప్రత్యామ్నాయం.

పెడిక్యూర్

పెడిక్యూర్ అనే పదం గ్ర్రీకు భాష నుంచి వచ్చింది. మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవటం అని దాని అర్థం. రోజంతా పని చేసి అలసి పోయిన పాదాలు, మడమలు, కాలి వేళ్ళు, గిలక భాగాలకు సున్నితమైన మసాజ్ సాయంతో ఉపసమనాన్ని కలిగించటమే పెడిక్యూర్. ప్యూమిస్‌ స్టోన్‌, మసాజ్‌ క్రీమ్‌, నెయిల్‌ బ్రష్‌, నెయిల్‌ క్లిప్పర్స్‌, నెయిల్‌ వార్నిష్‌, ఒక చిన్న టబ్‌  సమకూర్చుకుంటే  ఎవరికీ వారు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్ లో భాగంగా చేసే మసాజ్, టోనింగ్ వల్ల  పాదాలకు బలం చేకూరటమే గాక   రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. 

చేసే పద్దతి

ముందుగా కాలి గోళ్ళ రంగు ఉంటే తొలగించాలి. ఇప్పుడు ఒక బకెట్ లో  గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో 2 కాయల నుంచి తీసిన నిమ్మరసం, చిటికెడు ఉప్పు, సుగంధ నూనె, తేలికపాటి షాంపూ వేసి కలిపి అందులో అరగంట పాటు పాదాలను పెట్టి కూర్చోవాలి. పాదాలు నానిన తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌ లేదా బరకగా పట్టించిన సున్నిపిండితో మడమలు, అరికాళ్ళను రుద్ది శుభ్రం చేయాలి.

పెడిక్యూర్ తర్వాత గోళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎగుడు దిగుడుగా పెరిగిన గోళ్ళను సమంగా కట్టేరించి కోవటం, అక్కడ ఇంకా ఏమైనా మట్టి చేరితే తొలగించటం చేయాలి. తర్వాత నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మర్దనా చేయటం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. రోజూ స్నానం పూర్తి కాగానే పాదాలకు మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

పెడిక్యూర్ కోసం వాడే బ్రష్, నెయిల్ కట్టర్ వంటి పరికరాలను జాగ్రత్తగా వాడాలి. కాస్త ఖర్చు పెట్టగలిగిన వారు బ్యూటీ సెలూన్లో పెడిక్యూర్ చేయించుకోవచ్చు. నిపుణులైన వారు చేసే పద్దతి కాస్త భిన్నంగానే గాక పాదాలకు గొప్ప హాయినీ అందిస్తుంది. ఈ తరహా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పాదాలు అందంగానే గాక ఆరోగ్యంగానూ ఉంటాయి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE