మిగిలిన కాలాలతో పోల్చినప్పుడు వేసవిలో ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువే. తీవ్రమైన కలరా మొదలు వాంతులు, సాధారణ నీళ్ళ విరేచనాల వరకు ఈ సీజన్ లో కనిపిస్తుంటాయి. జల కాలుష్యం, పాడైపోయిన ఆహారం తీసుకోవటం తదితర కారణాలే ఇందుకు ప్రధాన కారణాలు. అందుకే ఈ తరహా సమస్యలపై తగినంత అవగాహన అవసరం.

వేసవిలోనే ఈ తరహా సమస్యలు ఎందుకొస్తాయి?

జలకాలుష్యమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. వేసవిలో భూగర్భ జలాలు ఎండిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. మురుగు కూడా మంచినీటిలో కలిసే అవకాశం ఉంది.  అందుబాటులో ఉన్న నీటి వనరులను వాడటం తప్ప సహజంగా ఈ సీజన్లో మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఆ నీటినైనా కాచి వడపోసి తాగితే పర్వాలేదు గానీ లేక పోతే కలరా,టైఫాయిడ్, కామెర్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తప్పవు. వీటికి తోడూ వేసవిలో ఈగల బెడద ఎక్కువ. రోగ కారకాలపై వాలిన ఈగలు ఆహారం మీద వాలటం వల్ల కూడా ఈ ఉదర సమస్యలు వస్తాయి. వేసవిలో వండిన ఆహారం త్వరగా మెత్తబడి పాడైపోతుంది. పొరబాటున ఇలాంటి ఆహారం తీసుకున్నా ఈ సమస్యలు తప్పవు. 

ఈ తరహా రోగాల నివారణ ఎలా?

జ్వరం, విరేచనాలు, వాంతుల వంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి  వీలున్నంత ఎక్కువ మంచినీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీరు, తేలికగా అరిగే సూపుల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటికి ఓ చిటికెడు ఉప్పు కలిపితే మరీ మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ముప్పును నివారించవచ్చు. శరీరం కోల్పోయిన నీటిని మళ్ళీ ఏదో ఒక రూపంలో అందిస్తేనే సమస్య అదుపులోకి వస్తుంది.

వైద్య సలహా తప్పక తీసుకోవాలా?

నీళ్ళ విరేచనాలు, వాంతులు, మలంలో రక్తం వంటి లక్షణాలుండి, ఒక రోజులో పరిస్థితి అదుపులోకి రాకపోతే వైద్య సలహా తోసువటం ఎంతైనా అవసరం. ఇక.. బియ్యం కడిగిన నీళ్ళలా విరేచనాలు అవుతుంటే కలరాగా అనుమానించి వెంటనే చికిత్స ఇప్పించాలి.

మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

అరాకొరా పరిజ్ఞానంతో మందులు వాడటం ఎప్పుడూ ప్రమాదమే. చాలా మంది ప్రతి సమస్యకూ యాంటీ బయొటిక్స్ వాడుతారు. ఒక్కోసారి ఇవి వికటించి సమస్యను మరింత జటిలం చేస్తాయి. ముఖ్యంగా నీళ్ళ విరేచనాలతో బాధపడే వ్యక్తి యాంటీ బయోటిక్స్ వాడితే సమస్య విషమిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి.

విరేచనాలు అయ్యే వ్యక్తికి ఇత అనారోగ్యాలుండే అవకాశం ఉందా?

చాలా వరకు అవకాశం ఉంది.  ఎందుకంటే టైఫాయిడ్ ఉన్నవారిలో నీళ్ళ విరేచనాలు, షిగెల్లా వైరస్ ఉంటె నెత్తురు విరేచనాలు అవుతాయి. కాబట్టి  ఇలాంటి సందర్భాల్లో వైద్యుల సలహా తీసుకోవటానికి వెనకాడకూడదు. 

డయేరియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బయత అమ్మే పండ్ల రసాలు, ఐస్ కలిపినా పానీయాలు తాగొద్దు. పచ్చి కూరగాయలకు బదులుగా ఉడికించినవి తినాలి. పండ్లు, కూరగాజలు,ఆకుకూరలు బాగా కడిగి వాడాలి. భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన తర్వాత తప్పక సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూడటం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా ఈగల వంటి కీటకాలు చేరకుండా చూడటం అవసరం. 

 



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE