ఇటీవలి కాలంలో మూత్రసంబంధిత సమస్యలు.. అందునా మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో  చికిత్స తీసుకునే వారి సంఖ్య  ఎక్కువగా ఉంటోంది. ఒంట్లో అధికంగా ఉన్న నీటితో బాటు వ్యర్థాలను బయటకు పంపటమే మూత్రాశయం యొక్క ప్రధానమైన పని. మూత్రాశయంలో మూడు ప్రధాన భాగాలుంటాయి. అవి..  మూత్ర నాళం (మూత్రాన్ని కిడ్నీ నుంచి మూత్రాశయానికి చేర్చేది), మూత్రాశయం(మూత్రం నిలువ ఉండే చోటు), మూత్రమార్గం (మూత్రాన్ని విసర్జించేది). పలు కారణాల వల్ల మూత్రకోశం పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటుంది. మూత్ర మార్గ నిర్మాణంలోని మార్పుల కారణంగా పురుషులతో పోల్చితే మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ల బెడద చాలా ఎక్కువ. నిజానికి ముందుగా గుర్తించి చికిత్స చేస్తే ఇవి అంతగా ఇబ్బంది పెట్టవు గానీ , దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్రమైన  సమస్యగా పరిణమిస్తాయి.

కారణాలు

 • లైంగిక కలయిక వల్ల మూత్రమార్గపు దిగువ భాగం ఇన్ఫెక్షన్లకు గురవుతుంది.
 • గర్భనిరోధక మాత్రలు, శుక్రకణాలను నిర్వీర్యం చేసే మందుల వినియోగం వల్ల కూడా సమస్య రావచ్చు.
 • మెనోపాజ్కు దగ్గరగా ఉన్న మహిళల్లో మూత్రకోశ ఆకారంలో వచ్చే మార్పులు, హార్మోన్ల ఉత్పత్తిలో కలిగే మార్పులు కూడా సమస్యకు కారణం కావచ్చు.
 • పుట్టుకతోనే మూత్రకోశ నిర్మాణంలో లోపాలున్న పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువ.
 • మధుమేహం, కిడ్నీల్లో రాళ్ళు కూడా సమస్యకు కారణం కావచ్చు.
 • ప్రోస్ట్రేట్ గ్రంథి పెరిగి మూత్రాశయం మీద ఒత్తిడి ఎక్కువై ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు.
 • వ్యక్తిగత శుభ్రతను పాటించక పోవటం వల్ల
 • గర్భిణుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం పూర్తిగా బయటికి పోక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

లక్షణాలు

దొక్కల్లో నొప్పి, తీవ్రమైన చలి, వణుకుతో కూడిన జ్వరం, తరచూ వాంతులు, పొట్టలో వికారంగా ఉండటం, వెన్నుపూస దిగువ భాగాన అసౌకర్యంగా ఉండటం, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట,మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే  మూత్రకోశ ఇన్ఫెక్షన్ అని అనుమానించాల్సి ఉంటుంది.

పరీక్షలు

మూత్ర పరీక్షలో రక్తం, చీము కనిపిస్తే అది ఇన్ఫెక్షన్ అని గుర్తించాలి. తరచూ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తుంటే అల్ట్రాసౌండ్, ఎమ్మారై స్కాన్, సిటీ స్కాన్, ఎక్సరే వంటి పరీక్షల సాయంతో నిర్ధారణ చేయవచ్చు. అవసరాన్ని బట్టి యూరో డైనమిక్స్, సిస్టో స్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.

నివారణ

 • తగినంత నీరు తాగటం, సమయానికి మూత్రవిసర్జన చేయటం
 • మూత్రాశయాన్ని చీకాకు పెట్టే ఆల్కహాల్, కాఫీ వినియోగాన్ని తగ్గించటం
 • సంభోగం అనంతరం వెంటనే మూత్రవిసర్జన చేయకుండా ఉండటం
 • వ్యక్తిగత శుభ్రత మీద దృష్టి సారించటం
 • నెలసరి సమయంలో ప్యాడ్ల వినియోగం
 • గర్భనిరోధక మాత్రలు వాడకుండా ఉండటం
 • మర్మావయాల వద్ద స్ప్రే, ఇతర రసాయనాల వినియోగాన్ని నివారించటం
 • మెత్తని, వదులైన లోదుస్తులు వాడటం ద్వారా ఆయా భాగాలు పొడిగా ఉండేలా చూసుకోవటం
 • నాళికలు, ట్యూబుల ద్వారా మూత్ర విసర్జన చేసేవారు ఎప్పటికప్పుడు ఆయా పరికరాలను స్టెరిలైజ్ చేసి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి.
 • పొట్ట ఖాళీగా ఉంటె వికారం ఎక్కువయ్యే ముప్పు ఉన్నందున సమయానికి తినాలి. ఉదయం వీలున్నంత త్వరగా అల్పాహారం తెసుకోవాలి.
 • వాంతి అయ్యేలా ఉంటే నిమ్మ, నారింజ, దబ్బ, ఉసిరి వంటి పండ్ల ముక్కలను బుగ్గన పెట్టుకోవాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE