మనిషి ఎంత కాలం జీవించాడనే దానికంటే ఉన్నన్ని రోజులూ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం. ఈ సూత్రాన్ని మనసా వాచా నమ్మి ఆచరణలో పెట్టిన మన పూర్వీకులు దీర్ఘకాలం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించారు.  అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని  అలవరుచుకోవటంతో బాటు దిగువ చెబుతున్న కొన్ని అంశాలపై దృష్టి పెట్టగలిగితే నేటి ఆధునిక యుగంలోనూ అలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చు.

 చక్కని ఆరోగ్యం కోరుకునే వారంతా మితాహారం తీసుకోవాలి. అతిగా తినటం అలవాటైతే ఊబకాయం, జీర్ణ సమస్యలు, ముందుగానే ముదిమి లక్షణాలు రావచ్చు.

 • రుచి కంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకోవాలి.
 • ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో దానిని వేళపట్టున తీసుకోవటమూ అంతే ముఖ్యం.
 • రోజుకో గ్లాసు క్యారెట్, కీరా వంటి కూరగాయల, ఉసిరి, నిమ్మ తదితర పండ్ల రసాలు తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణం కావటమే గాక తగినన్ని  యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
 • ఆహారంలో తగినన్ని మాంసకృత్తులు ఉంటేనే శరీరంలో జీవ కణాల పుట్టుక, పనితీరు, ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. 
 • నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా ఫలం వంటి పుల్లని పండ్ల రసాలు రోగనిరోధక శక్తిని పెంపొందించి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
 • ఆహారం తయారీలో నూనెలు పరిమితంగా వాడాలి. వేరుశెనగ నూనె కంటే ఆలివ్‌, తవుడు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు మేలు. తక్కువ నూనె వాడి ఆవిరి మీద ఉడికించుకోగలిగితే పోషకాలూ నష్టపోకుండా చూసుకోవచ్చు.
 • మైదా, చక్కెర వాడకాన్ని పరిమితంగా తీసుకోవాలి. ప్రాసెస్డ్‌ ఆహారం, వేపుళ్లు తీసుకునే బదులు అప్పటికప్పుడు వండిన ఆహారం తీసుకోవాలి.
 • పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు యోగా, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.
 • కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపటం, స్నేహితులతో సరదాగా గడపటం,పెంపుడు జంతువులు, మొక్కల బాగోగులు చూడటం వల్ల వయసు ప్రభావాన్ని అధిగమించవచ్చు.
 • వారానికి అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయటం లేదా రోజూ ఏదైనా అలసట కలిగించే ఆటలు ఆడటం వల్ల చెమట రూపంలో శరీరంలోని విషపదార్థాలు బయటికి పోతాయి. ఏరోబిక్‌ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి.
 • ధూమపానం, మద్యపానం వంటివాటికి దూరంగా ఉంటే మరింత మంచిది.
 • ఉండగలిగితే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండొచ్చు. ఆరోజు రోజువారీ ఆహారానికి బదులు పచ్చి కూరగాయ ముక్కలు (సలాడ్లు) తినొచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE