వానాకాలం వచ్చేసింది. వారాల తరబడి పట్టే ముసురు కారణంగా ఎండ పొడ లేక ఏర్పడే చిత్తడి వాతావరణం పలు రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం,  అలవాట్లు మార్చుకోవటం ద్వారా  ఈ తరహా ఇన్ఫెక్షన్ల బారినుంచి సులభంగా తప్పించుకోవచ్చు. అవి..

 • కాచివడపోసిన నీటిని లేక ప్రమాణాల మేరకు శుభ్రపరచిన నీరు మాత్రమే తాగాలి.
 • పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా కడిగి మాత్రమే వాడాలి.
 • మంచి నీటి పైపుల్లో లీకేజీలు ఉంటే మురుగు, వర్షపు నీరు కలిసే ముప్పు ఉన్నందున వేసవిలోనే ఈ మరమ్మతుల మీద దృష్టి పెట్టాలి.
 • ఎప్పటికప్పుడు నీళ్ళ సంపులు, ఓవర్ హెడ్ టాంకులు బ్లీచింగ్ పౌడర్ వాడి  శుభ్రం పరుచుకోవాలి. 
 • ఇంటి ఆవరణ, పరిసరాల్లో వాన నీరు నిలవకుండా చూసుకోవటంతో బాటు సమీపంలో ఎండిన కొబ్బరి టెంకలు, వాడి పారేసిన ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ములు వాహనాల పాత టైర్లు వంటివి లేకుండా చూడాలి.  లేకుంటే  దోమలు, ఇతర కీటకాల ముప్పు తప్పదు.
 • అన్నం, కూరలు ఏరోజు చేసినవి ఆరోజే తినాలి. వృధా అవుతాయని చద్దివి తినరాదు.
 • ఈగలు, దోమలు వాలకుండా వంట పాత్రలు, మంచినీటి పాత్రల మీద మూతలు పెట్టాలి.
 • వానలో తడిసి ఇంటికి రాగానే పాదరక్షలు బయట విప్పి కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగే అలవాటు మానుకోవటం మంచిది.
 • స్నానం చేసి ఒళ్ళు తుడుచుకొనేటప్పుడు చంకలు, గజ్జలలో తడి లేకుండా తుడుచుకొని పొడి దుస్తులు ధరించాలి.
 • కాలి మడమలు, వేళ్ళ మధ్య ఫుంగస్ చేరి చర్మ సమస్య వచ్చే ముప్పును దృస్టిలో పెట్టుకొని ఈ సీజన్లో షూ కంటే గాలి ఆడేలా చెప్పులు వాడటం మంచిది. ఒకవేళ షూ తప్పనిసరి అయితే కాస్త వదులుగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవటం మంచిది.
 • వానాకాలం ఉతికిన బట్టలు ఆరవని విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోకుండా కాస్త ఇబ్బంది అయినా ఉతికిన వాటినే ధరించాలి. తడి తువ్వాళ్ళు, పాత బట్టలు కుప్పలుగా వదిలేస్తే ఇన్ఫెక్షన్లు తప్పవని గుర్తించుకోవాలి.
 • చెవి స్రావాలు, చర్మం మీద దద్దుర్లు, మచ్చలు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
 • వంటగదిలో వాడే పాతబట్టలు, పాత్రలు కడిగే బ్రష్ తదితరాలపై క్రిములు ఎక్కువగా చేరే ముప్పు ఉన్నందున ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE