మనిషి జీవన వేగం పెరిగేకొద్దీ మానసిక ఒత్తిడి కూడా  పెరుగుతోంది.  సంప్రదాయ జీవనానికి అలవాటుపడ్డ వారు ఈ వేగాన్ని అందుకొనే క్రమంలో  పలు రకాల మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఇది తీవ్రమైన అశాంతికి, అసంతృప్తికి, మరికొందరిలో ఒంటరితనం, అభద్రతాభావం, అదుపులేని కోపం, ఆందోళనకు దారితీస్తోంది. ఈ సమస్యలకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. 

  కేరళ పంచకర్మ చికిత్సల్లో  ప్రధానమైనది ధారా చికిత్స. ఇందులో  ఔషధ గుణాలున్న ద్రవాలను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోస్తారు. ఇందులో మూర్ధన్య ధార (నుదుటిమీద పోసే ధార), సర్వాంగ ధార (శరీరం మొత్తం పోసేది ), పరిశేక (శరీరంలో ఒక భాగం మీద ప్రత్యేకంగా పోసేది) అని  మూడు రకాలు ఉన్నాయి. వీటిలో మూర్ధన్య ధారను శిరోధార అనికూడా అంటారు. మానసిక రోగాలైన సైకోసిస్‌, పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్‌, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధుల చికిత్సకు ఈ శిరోధార ఎంతో ఉపయోగపడుతుంది.

తలనొప్పి, మానసిక సమస్యలున్న వారికి నూనెతో, నిద్రలేమి, చిత్తచాంచల్యం, మానసిక ఒత్తిడి, తీవ్రమైన తలనొప్పి ఉంటే పాలతోనూ, పి త్త  దోష కారక వ్యాధులు, నిద్రలేమి సమస్యలుంటే నెయ్యితో, హృదయ సంబంధిత సమస్యలు, వీర్యలోపాలు తదితరాలకు మజ్జిగతోనూ శిరోధార  చికిత్స చేస్తారు. ఇవిగాక ఆయా సమస్యను బట్టి కొబ్బరినీరు, శుద్ధి చేసిన నీరు తదితరాలనూ శిరోధారకు వాడుతారు. 

శిరోధారా విధానంలో ఔషధ గుణాలున్న ద్రవాలను 4 నుంచి 8 అంగుళాల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా చేస్తారు. వ్యాధిని బట్టి, దోషాన్ని బట్టి అరగంట నుంచి గంటన్నర వరకు దీనిని కొనసాగిస్తారు. ఈ చికిత్స ద్వారా శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం, అక్కడి  చక్రాలను చైతన్యవంతం చేయడం మూలంగా మానశిక ఒత్తిడి, మనోవికారాలు తప్పక దూరమవుతాయి.Recent Storiesbpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

శరన్నవరాత్రి వైశిష్ట్యం 

ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు 

MORE