• HOME
  • ఆరోగ్యం
  • సర్వైకల్ స్పాండిలోసిస్.. హోమియో చికిత్స 

ఇటీవలి కాలంలో నీడపట్టున కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తోన్న సమస్య సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ భాగంలోని మెత్తని ఎముకలతో కూడిన డిస్క్ అరిగి క్రమంగా పక్కకు జరిగి ఆ ప్రదేశంలోని నాడులను కుచించుకుపోయేలా చేయటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన మెడనొప్పి, మీద సాఫీగా తిరగకపోవటం, మెడ  భాగం మొద్దుబారి పోవటం దీని లక్షణాలు. దీని చికిత్స కోసం పలు ఇతర వైద్య విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు చాలామంది హోమియోపతి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. సర్జరీ అవసరం లేకపోవటం, సమస్యను మరల మరల రాకుండా  చూడటం, చక్కని ఔషధాలు అందుబాటులో ఉండటం వంటి అంశాలే హోమియో వైద్యం వైపు మొగ్గుకు ప్రధాన కారణాలు. 

కారణాలు

  • ప్రమాదవశాత్తూ మెడ భాగానికి దెబ్బతగిలి డిస్క్ పక్కకు జరగటం, అక్కడి మెత్తని లిగమెంట్స్ తెగిపోవటం వల్ల ఈ సమస్య రావచ్చు.
  • మెడ ఒక పక్కకు పెట్టి నడిచే అలవాటు, పడుకున్నప్పుడు ఒకే భంగిమలో పడుకోవటం వంటి సమస్యలూ కారణం కావచ్చు.
  • కంప్యూటర్ మీద రోజంతా పనిచేసే ఐటీ, కాల్ సెంటర్ ఉద్యోగులు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనై, ఆ ప్రభావం హార్మోన్ల మీద పడి క్యాల్షియం మెటబాలిజం దెబ్బతిని అంతిమంగా స్పాండిలోసిస్ గా మారుతుంది.
  • వేళ పట్టున తినకపోవడం, జీర్ణ సమస్యల కారణంగా కూడా సమస్య రావచ్చు.

లక్షణాలు

  • తీవ్రమైన మెడనొప్పి, నొప్పి భుజాలు, చేతుల వరకు పాకటం
  • చేతులు, భుజాలు మొద్దుబారిపోవటం
  • మెడ తిరగకపోవటం, చేతులు వేలాడి పోవటం,
  • తలనొప్పి, కళ్ళు తిరగటం, శరీర కదలికల మీద నియంత్రణ తగ్గటం
  • తెలియకుండానే మూత్రం రావటం 

చికిత్స

హోమియోపతి వైద్యంలో ఇతర చికిత్సా విధానాల మాదిరిగా ఈ సమస్యకు ఎలాంటి సర్జరీ అవసరం లేదు. కేవలం మందులు వాడుతూ కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే క్రమంగా సమస్య దారికొస్తుంది. బాధితుల శారీరక, మానసిక ప్రవృత్తులను బట్టి  బ్రయోనియా, లాకెసిన్, పల్సటిల్లా, కాలీకార్బ్ వంటి హోమియో  మందులు వాడితే సరిపోతుంది. కూర్చోవాల్సిన, పడుకునే భంగిమల్లో మార్పులు కూడా చేసుకోవాలి. సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులను ఆశ్రయిస్తే తక్కువ సమయంలోనే ఇబ్బంది తొలగి పోతుంది.                                                                    

                                                                   - డా. భోగాది రాజశేఖర్ , ష్యూర్ కేర్ హోమియోపతి 

 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

శరన్నవరాత్రి వైశిష్ట్యం 

ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు 

MORE