మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మెడ దిగువగా ఉండే శ్వాస నాళానికి ఇరువైపులా సీతాకోకచిలుక రెక్క ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి స్రవించే థైరాయిడ్‌ హార్మోన్‌ శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి శారీరక క్రియలను ప్రభావితం చేస్తుంది . కొందరిలో ఈ గ్రంథి పనితీరులో వచ్చే అవాంఛిత మార్పులు హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం అనే సమస్యలకు దారితీస్తాయి. థైరాయిడ్ పనితీరులో కనిపించే ఈ మార్పులకు ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియవు. అయితే వీలున్నంత త్వరగా ఈ సమస్యలను గుర్తిస్తే థైరాయిడ్ గ్రంధి పనితీరును సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

లక్షణాలు

 ఉన్నట్టుండి గుండె దడ, చేతులు వణకడం, కారణం లేని దిగులు, ప్రతి పనిలోనూ కంగారు, అరచేతుల్లో చెమటలు పట్టటం, ఉన్నది లేనట్టుగానూ,  లేనిది ఉన్నట్టు భ్రమపడటం, అర చేతుల్లో చెమట పట్టటం, నరాల బలహీనత, ఎప్పటిలాగే తింటున్నా బరువు కోల్పోవటం, వేడి వాతావరణాన్ని తట్టుకోలేక పోవటం, జుట్టు ఎక్కువగా ఊడిపోవటం, తరచూ విరేచనాలు, కళ్ళు బయటికి పొడుచుకురావటం.

థైరాయిడ్ సమస్యలు.. రకాలు

హైపర్ థెరాయిడిజం

 థెరాయిడ్ గ్రంథి సాధారణం కంటే ఎక్కువగా  పనిచేయటాన్ని హైపర్ థెరాయిడిజం అంటారు. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో సుమారు 6రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య రావచ్చు. మగత, ఏ పనిమీదాదృష్టి నిలపలేక పోవటం,జుట్టు పొడిబారి ఊరికే రాలిపోవడం,ముఖం, మెడ భాగాల్లో చెమట, పెళుసు బారిన గోళ్లు, చర్మం పొడిబారి దురద పెట్టటం, ముఖం ఉబ్బటం, వదలని మలబద్ధకం, బరువులో మార్పులు, ఎనీమియా, అలసట, నీరసం దీని లక్షణాలు. థైరాయిడ్ పరీక్ష చేయించినప్పుడు రక్తంలో టి.ఎస్‌.హెచ్‌ స్థాయి పెరిగినట్లు వస్తే హైపో థైరాయిడ్‌జమ్‌ నిర్ధారణ అయినట్లే.

హైపోథైరాయిడిజం

థెరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం మూలంగా వచ్చే సమస్య ఇది. పుట్టుకతో వచ్చే థెరాయిడ్ గ్రంథి లోపాలు, ఐయోడిన్ లోపం, వంశపారంపర్యంగానూ ఈ సమస్యరావచ్చు. సాధారణంగా 35 ఏళ్ళు పైబడిన మహిళల్లో ఇది కనిపిస్తుంది. ఈ రుగ్మత దీర్ఘకాలం కొనసాగితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖం ఉబ్బటం, మానసిక ఆందోళన, నత్తిగా మాట్లాడటం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పట్టటం, కండరాలనొప్పి, మలబద్ధకం, రక్తహీనత, సంతాన లేమి,అలసట, కాళ్లు, చేతులు నీరు పట్టడం, గొంతు వద్ద థెరాయిడ్ గ్రంథి పెరిగినట్లు కనిపించటం, నాడి వేగం తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. త్రైరోది పరీక్ష ద్వారా ఇది నిర్ధారణ అవుతుంది. 

థైరాయిడ్ లక్షణాలు  కనిపించగానే వెంటనే వైద్యుల సలహా తీసుకొని తగు చికిత్స తీసుకోవాలి. మందులతోపాటు యోగ, ధ్యానం, శారీరక వ్యాయామాలు చేస్తే ఈ సమస్య మరింత త్వరగా అదుపులోకి వస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE