ఈ రోజుల్లో మధుమేహం సాధారణ ఆనారోగ్యం. ఇది వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. వైద్యపరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్పిలవబడే మధుమేహాన్ని వాడుక భాషలో షుగర్ అనీ వ్యవహరిస్తారు. గతంలో నాడు వయసు, వయసుపైబడిన వారి సమస్యగా ఉన్న మధుమేహం ఇప్పుడు 4 ఏళ్ళ చిన్నారులనూ వేధిస్తోంది. జన్యుపరమైన అంశాలను పక్కనబెడితే జీవన శైలి సమస్యలే మధుమేహానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. మధుమేహం అంటే ఏమిటి? అదెలా వస్తుంది? నివారణ, చికిత్స ఏమిటి? తదితర వివరాల గురించి తెలుసుకుందాం. 

డయాబెటిస్ అంటే?

ఆహారంలో పిండిపదార్థాల ద్వారా శరీరానికి అందే చక్కెర ( ముఖ్యంగా గ్లూకోజ్)జీవక్రియల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదితిండి గింజలు, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తదితరాల్లో ఉండే పిండి పదార్ధం ద్వారా శరీరానికి అందుతుంది. జీర్ణమైన ఆహారం ద్వారా రక్తంలో జేరేచక్కెర పరిమాణాన్ని నియంత్రించేందుకు మన శరీరంలోని క్లోమం అనే అవయవం రోజూ తగినంతగా ఇన్సులిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిసాధారణంగా 180 మిల్లీగ్రాముల శాతం కంటే ఎక్కువైనప్పుడు మూత్ర పిండం గ్లూకోజ్ నురక్తంలో నిలుపుకోలేక దాన్ని మూత్రం ద్వారా బయటికి పోయేలా చేస్తుంది. ఈ పరిస్థితినే మధుమేహం అంటారు.

ఎన్ని రకాలు? 

క్లోమం అతిగా లేక కొరతగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయటం వల్ల పెద్దల్లో అంటే.. 40 ఏళ్ళ పైబడిన వారిలో మధుమేహం వస్తుంది. ఈ పరిస్థితిని మందుల వినియోగం, జీవన శైలి మార్పులతో నియంత్రించవచ్చు. చిన్నారులు, యువతలో కనిపించే మధుమేహానికి క్లోమము తగినంత ఇన్సులిన్ ను తయారు చేయలేక పోవటమే ప్రధాన కారణం. ఈ సంసి ఉన్నప్పుడు వారు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు

  • మధుమేహాన్ని వీలున్నంత త్వరగా గుర్తించాలి. ముఖ్యంగా పెద్దలకు ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఉంది గనుక ముందు జాగ్రత్త అవసరం.
  • వైద్యులు, పోషకాహార నిపుణులు సూచించిన ఆహారం తీసుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు సాధ్యమైనంత మేరకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి.
  • మధుమేహులు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. లేకుంటే రక్త నాళాలు కుంచించుకుపోవటం, రక్తంలో కొవ్వు చేరటం మొదలు మరెన్నో సమస్యలు తప్పవు.
  • రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకొని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహానికి అధిక రక్తపోటు తోడైతే కోలుకోలేంతగా ఆరోగ్యం దెబ్బ తింటుంది.
  • ఆహారంలో ఉప్పు, నూనె, వెన్న వినియోగం తగ్గించాలి. ఒకేసారి ఎక్కువగా తినటం కంటే విడతల వారీగా కొంచెం కొంచెం ఆహారం తీసుకోవాలి.
  • ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు పెరిగే కొద్దీ ముప్పు ఎక్కువవుతుందని గుర్తించాలి.
  • రోజూ కనీసం గంటసేపైనా నడక, జాగింగ్, ఈత వంటి వ్యాయామం తో బాటు యోగా, ప్రాణాయామం సాధన చేస్తే మంచిది.
  • మధుమేహులు గాయాల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత పొడి గుడ్డతో పాదాలు, వేళ్ళ వద్దతడిలేకుండాతుడుచుకోవాలి. వాన నీటిలో తిరగటం, బిగుతుగా ఉన్న చెప్పులు వాడటం, చెప్పులు లేకుండా తిరగటం వంటివి చేయగూడదు.
  • రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇన్ఫెక్షన్లు కూడా రావు. 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE