• HOME
 • ఆరోగ్యం
 • వానాకాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు

వదలకుండా కురుస్తున్న వర్షాల మూలంగా వాతావరణం ఊహించనంతగా మారిపోయింది. చల్లని ఈ వాతావరణంలోవైరస్, బ్యాక్టీరియావంటివి వేగంగా వృద్ది చెందే ప్రమాదం ఉన్నందున ఈ సీజన్లో తగు జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం అవి..

 • కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగా కడిగి వండుకోవాలిపచ్చివి తినకపోవటమే మేలు.
 • ఓవర్ హెడ్ టాంకులు, నీళ్ళు నిల్వజేసుకునే సంపులు బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్ర పరుచుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిలో పరిమితంగా బ్లీచింగ్ పౌడర్ కలుపుకోవాలి.
 • ఫిల్టర్ లేదా కాచి వడబోసిన నీటిని మాత్రమే వాడాలి.
 • ఇంటి పరిసరాలలో ఎక్కడా వాన నీరు నిలవకుండా చూసుకోవాలి. ఎండిన కొబ్బరి చిప్పలు, వాడి పారేసిన ప్లాస్టిక్‌ డబ్బాలు, డ్రమ్ములు , పాత టైర్లు వంటివి లేకుండా చూడాలి. లేకుంటే డెంగ్యూ, మలేరియా కారక దోమలు వృద్ధి అయ్యే ప్రమాదం ఉంటుంది.
 • అప్పటికప్పుడు వండుకొన్న వేడివేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. వృధా అవుతాయనే ఉద్దేశంతో మిగిలిపోయిన అన్నం, కూరలు మరునాడు తింటే సమస్య తప్పదు
 • వంటపాత్రలు, నీళ్ళ బిందెల మీద ఈగలు, దోమలు వాలకుండా తప్పక మూతలు పెట్టాలి .
 • వానలో తడిస్తే ఇంటికి చేరగానే పాదరక్షలు బయట విప్పి కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. వేడినీటితోతలస్నానం చేసి పొడి తువ్వాలుతో తల, ఒళ్ళుశుభ్రంగా తుడుచుకొని పొడి దుస్తులు ధరించాలి. చంకలు, గజ్జల్లో తడి లేకుండా చూసుకోవాలి.
 • ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగే అలవాటు మానుకోవాలి. ఇంట్లో తడి బట్టలు, తువాళ్ళు కుప్పలు కుప్పలుగా పెడితే ఫంగస్ ఏర్పడి చర్మరోగాలకు దారితీసే ముప్పు ఉంది.
 • వంటగదిలో వాడే పాతబట్టలు, పాత్రలు కడిగే బ్రష్‌, సింక్, కుళాయిలు, గ్యాస్ స్టవ్ తదితరాల మీద క్రిములు చేరకుండా ఎప్పటికప్పుడు వేడినీటితో శుభ్రపరచాలి
 • వాననీటిలో చెప్పులు లేకుండా తిరగకూడదు. ఒకవేళ తిరిగితే వేడినీటితో కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి. వేళ్ల మధ్య తడిలేకుండా చూసుకోవాలి లేకుంటే ఫంగస్‌ చేరి చర్మ సమస్య వచ్చే ముప్పు ఉంటుంది.
 • ఈ సీజన్లో షూ కంటే చెప్పులు వాడటం మంచిది. దీనివల్ల పాదాల వద్ద చెమ్మ చేరదు సౌకర్యంగా కూడా ఉంటుంది. ఒకవేళ వానకు తడిసినా తొందరగా ఆరతాయి. షూ తప్పనిసరి అయితే వదులుగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవటం మంచిది.
 • చెవిపోటు, చెవిలో స్రావాలు, చర్మం మీద దద్దుర్లు, మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE