ఇల్లైనా, ఆఫీసైనా పట్టుమని 10 నిమిషాలు ఒకచోట కూర్చోలేరు. నలుగురిలోకి వెళ్లి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోలేరు. మల విసర్జన అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఇవి మొలల (పైల్స్) బాధితుల ఇబ్బందులు. నలుగురికీ చెప్పుకోలేని సమస్యగా ఉండటంచే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువే. అయితే తొలిదశలో ఈ సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే సులభముగా అదుపుచేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మొలలు లేక అర్శమొలలు అని పిలిచేఈ సమస్యకు హోమియోపతి వైద్య విధానం సులభమైన, మేలైన ప్రత్యామ్నాయం.

లక్షణాలు

మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం పడటం, మలవిసర్జన తర్వాత కూడా నొప్పి, మంట కొనసాగటం, మలద్వారానికి ఇరువైపులా రక్తం గడ్డ కట్టటం, పిలకలు ఏర్పడి వేళ్ళాడుతూ బయటకు పొడుచుకు రావటం

కారణాలు

 • దీర్ఘకాలం మలబద్దకంతో బాధపడటం
 • మానసిక ఒత్తిడి అధికం కావటం
 • రోజంతా ఒకే భంగిమలో కూర్చొని పని చేయటం
 • బాగా దాహమైతే తప్ప నీరు తాగకపోవటం
 • మితిమీరిన మద్యపానం
 • వేపుళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్స్‌, మాంసాహారం వంటివి రోజూ తినటం

హోమియో చికిత్స

ఇతర వైద్య విధానానికి భిన్నంగా హోమియోలో రోగి శారీరక స్థితితో బాటు మానసిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకొని చికిత్స చేస్తారు. దీనివల్ల మళ్ళీ మళ్ళీ ఈ సమస్య తిరగబెట్టటం ఉండదు. పైల్స్ సమస్యకు హోమియో వైద్య విధానంలో చాలా మంచి ఔషధాలున్నాయి. సమస్యను తొలిదశలో గుర్తించగలిగి, చికిత్స తీసుకుంటే సత్వర ఫలితాలుంటాయి. పైల్స్‌ చికిత్సలో ఉపయోగపడే కొన్ని మందుల వివరాలు...

 • మలబద్దకం, మలవిసర్జన బాధాకరంగా మారటం, మొలలు బయటకు పొడుచుకొచ్చిన వారికి సల్ఫర్ మంచి ఔషధం.
 • మల ద్వారం పొడిబారటం, మలద్వారాన్ని పదునైన వస్తువుతో గుచ్చుతున్న భావన, మల విసర్జన అనగానే భయపడటం,మలవిసర్జన తర్వాత నొప్పి ఉంటే అస్కులస్‌హిప్‌ ఔషధాన్ని వాడొచ్చు.
 • శారీరక శ్రమ లేక మలబద్దకంతో బాధపడుతూ సుఖవిరేచనానికి మందులు వాడేవారు, రోజులో అనేక పర్యాయాలు మల విసర్జన చేయాలనిపించి,తీరా వెళ్ళిన తరవాతమలవిసర్జన జరగకపోవటం వంటి లక్షణాలున్న వారికి నక్స్ వామికా మంచి ఔషధం.
 • ఆసనంలో గాజు పెంకులు గుచ్చుతున్న భావన, విరేచనం తర్వాత నొప్పి, మలంతో బాటు రక్తం వంటి లక్షణాలున్న వారికి రటానియా మంచి మందుగా పనిచేస్తుంది.
 • మలబద్దకం, మలవిసర్జన కాకపోవటం, అయినా మంట, నొప్పి ఉండటం కనిపిస్తే కూడా రక్తం విస్తారంగా పడుతూ ఉన్నప్పుడు హెమామెలీస్‌ మందు వాడుకోవచ్చు. 

గమనిక: ఈ మందుల వివరాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే  తప్ప సొంత నిర్ణయం మేరకు వాడేందుకు కాదు. కనుక పైల్స్ బాధితులు దగ్గరలో ఉన్న నిపుణులైనవైద్యులను కలిసి వారు సూచించిన మందులు మాత్రమే వాడాలి.Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE