మాతృత్వం ఒక గొప్ప వరం. మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. అయితే కొందరు మహిళలు గర్భం ధరించినా తరచూ గర్భస్రావం కావటంతో దీర్ఘకాలం పాటు మాతృత్వానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. తరచూ అయ్యే గర్భస్రావాలకు సరైన సమయంలో తగిన చికిత్స అందించి నివారించగలిగితే పండంటి బిడ్డకు జన్మనివ్వటం నూరు శాతం సాధ్యమే. ఈ సమస్యకు నిపుణులు ఇస్తున్న మరింత సమాచారం  గురించి తెలుసుకుందాం. 

నెలతప్పిన 24 వారాల్లో గర్భం నిలవని పరిస్థితిని వైద్య పరిభాషలో గర్భస్రావంగా నిర్వచిస్తారు. అయితే  నెలతప్పిన నాటి నుంచి మొదటి 3 నెలల్లో గర్భస్రావం జరిగితే  దాన్ని ఎర్లీఅబార్షన్‌ అంటారు. పలు కారణాల వల్ల ప్రతి 100 మంది గర్భిణుల్లో 20 మంది ఈ సమస్య ఎదురవుతుంది. అయితే కొందరిలో అరుదుగా ఆరు నెలలు నిండే సమయంలో 2 లేదా 3 సార్లు గర్భస్రావం అవుతుంటుంది. ప్రతి 100 మంది గర్భిణుల్లో కేవలం 2 లేదా 3 కేసుల్లోనే ఇలా జరుగుతుంది.  ఆ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘రికరెంట్‌ మిస్‌క్యారేజ్‌’ అంటారు.

కారణాలు

 • 32 లేదా అంతకంటే ఎక్కువ వయసు గర్భిణుల్లో గర్భస్రావాలు అయ్యే ప్రమాదం ఎక్కువ. 40 ఏళ్ళు దాటిన వారిలో ఈ ముప్పు మరీ ఎక్కువ. భర్త వయసు ఎక్కువైన సందర్భాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది.
 • ప్రతి 100 మంది గర్భిణుల్లో 2 నుంచి 5 కేసుల్లో వంశపారంపర్యంగా సంక్రమించిన జన్యు లోపాల మూలంగా గర్భస్రావం అవుతుంది.
 • రక్తం అవసరమైన దానికంటే ఎక్కువగా గడ్డ కట్టే లక్షణమున్న గర్భిణుల్లో గర్భస్రావం ముప్పు ఎక్కువ. గర్భిణుల్లో సమస్య ఉన్నప్పుడు గుర్రపువాతం, బిడ్డ ఎదుగుదల లోపాలు, నెలలు నిండకుండానే కాన్పు కావటం జరగొచ్చు.
 • గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉన్నప్పుడు, గర్భాశయ ఆకారం సరిగా లేనప్పుడు కూడా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువ.
 • కడుపులోని బిడ్డలో ఏర్పడే లోపాలు, తల్లికి ఉండే ఇన్ఫెక్షన్లు కూడా గర్భస్రావానికి దారితీయవచ్చు.
 • గర్భిణులకు మధుమేహం, థైరాయిడ్‌ ఉన్నప్పుడు కూడా గర్భస్రావం అయ్యే ముప్పు ఎక్కువ.
 • గర్భిణుల రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు కూడా గర్భస్రావం కావచ్చు.
 • గర్భిణులు ఊబకాయులైనా, కెఫీన్‌ పదార్థాలు అతిగా తీసుకున్నా, పొగతాగే అలవాటున్నా గర్భస్రావం అయ్యే ముప్పు ఎక్కువవుతుంది .

నిర్ధారణ

తరచూ గర్భస్రావం కావటం, కాన్పుకు ముందు గర్భస్రావం లక్షణాలు కనిపించినా వైద్య సలహా మేరకు రక్తపరీక్షలు చేయించటం ద్వారా రక్తం ఎక్కువగా గడ్డ కట్టే లక్షణం, ఇన్ఫెక్షన్ల ఉనికిని గుర్తించి  తగు చికిత్స చేస్తారు. జన్యులోపాలు ఉన్నప్పుడు భర్తకు కూడా రక్త పరీక్ష చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గర్భాశయ సంబంధిత ప్రతి సమస్యనూ ఖచ్చితంగా గుర్తించే మరెన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. 

చికిత్స

 • రక్తం ఎక్కువగా గడ్డకట్టే గర్భిణులు గర్భస్రావ నివారణకు మాత్రలు, ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల రక్తం పలుచబడి సమస్య నివారించబడుతుంది.
 • గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉండటం వల్ల గతంలో గర్భస్రావం జరిగితే మళ్ళీ జరగకుండా అవసరాన్ని బట్టి గర్భాశయ ముఖ ద్వారానికి కుట్లు వేస్తారు. గర్భాశయం ఆకృతిలో తేడాలుంటే గనుక సర్జరీ చేయాల్సి వస్తుంది.
 • గర్భందాల్చిన తొలినాళ్ళలో వైద్యుల సలహా మేరకు కొన్ని ఔషధాలు ని తీసుకోగలిగితే గర్భస్రావం కాకుండా చూసుకోవచ్చు.
 • మితిమీరి బరువు పెరగకుండా చూసుకోవటం, పోషకాహారం తీసుకోవటం, తేలికపాటి వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కూడా గర్భస్రావాన్ని నివారించవచ్చు.
 • గర్భధారణకు ముందే కొన్ని పరీక్షలు చేయించుకోవడంతోపాటూ ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్‌ తీసుకోవటం కూడా సమస్య నివారణకు విశేషంగా ఉపయోగపడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE