• HOME
 • ఆరోగ్యం
 • అవగాహనతోనే బ్రెస్ట్ క్యాన్సర్ దూరం

ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో మహిళల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి రొమ్ము క్యాన్సర్‌. మహిళలలో కనిపించే క్యాన్సర్‌లలో దీనిది రెండవస్థానం. 40ఏళ్లు పై బడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సగటున ప్రతి 8మంది మహిళల్లో ఒకరిలో ఈ క్యాన్సర్‌ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 10 లక్షల మంది కొత్తగా దీని బారినపడుతున్నారు. మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో 30మందిలో ఒకరు, గ్రామీణ ప్రాంతాల్లో 65మందిలో ఒకరు ఈ సమస్య బారిన పడుతుండగా మొత్తం మీద ఏటా లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. నిజానికి రొమ్ము క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులభం అవుతుంది.రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి ఈ తరహా మరణాలను గణనీయంగా తగ్గించేందుకుఅటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్‌ మాసాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు.

లక్షణాలు..

 • రొమ్మును పట్టుకొన్నప్పుడు చిన్న చిన్నగడ్డలు తగలటం
 • చనుమొనల నుంచి ద్రవాలు కారడం
 • చనుమొనలు కంది ఎర్రబారటం
 • కొందరిలో రొమ్ముల సైజు పెరగటం లేదా కుంచించుకు పోవటం
 • రొమ్ము రాయిలా గట్టిపడటం
 • ఎముకలలో నొప్పి, నడుము నొప్పి

కారణాలు..

 • రొమ్ము క్యాన్సర్వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా వచ్చే ప్రమాదం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ, రక్తసంబంధీకులకు ఇతర క్యాన్సర్‌లు ఉన్నా.. ఆ కుటుంబ మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ రావచ్చు.
 • జన్యు పరమైన లోపాలు, జన్యు మార్పులు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.
 • పిల్లలులేని, పిల్లలకు పాలివ్వని మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.
 • క్రొవ్వు పదార్థాలు అతిగా తీసుకోవడం, ధూమపానం, అధిక బరువు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.
 • అండాశయ, పెద్దపేగు క్యాన్సరు వచ్చిన వారిలోనూ రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
 • రొమ్ములకు సంబంధించిన అనారోగ్యాలున్న వారిలోనూ ఈ తరహా క్యాన్సర్ కనిపిస్తుంది.
 • 50 ఏళ్లు దాటిన వారిలో కలిగే హార్మోన్ మార్పులే రొమ్ము క్యాన్సర్ సోకటానికి ప్రధాన కారణం. కొందరిలో ముందు గర్భాశయ క్యాన్సరు సోకినా తర్వాత అది రొమ్ము క్యాన్సర్‌ గా మారొచ్చు. 

రొమ్ము క్యాన్సర్ దశలు 

వైద్యపరిభాషలో రొమ్ముల్ని మామరీ గ్రంథులంటారు.లిగమెంట్లు, పెద్ద కండరాల సమాహారంగా ఏర్పడే రొమ్ముల్లో 15-20 లోబ్స్‌తో బాటు లెక్కకు మించిన లోబ్యూల్‌లు నాళాలు ఉంటాయి. కొవ్వు, కణజాలం, ఆధార కణజాలం పొరలు పొరలుగా ఉండే రొమ్ముల్లోకొన్నిసార్లు ఈ కణాల్లో పెరుగుదల ఎక్కువై అవి.. క్యాన్సర్‌ కణాలుగా మారుతాయి. తొలిదశలోనే వీటిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇవి ఇతర భాగాలకు కూడా సోకే ప్రమాదం ఉంది.రొమ్ములో ఏ మేరకుక్యాన్సరు వ్యాపించినదనే అంశం ఆధారంగా చికిత్స తీరు ఉంటుంది. అవి

 1. శోష గ్రంధులలోకి వ్యాపించినదశ
 2. రొమ్ము లోపలి కండరాలలోనికి వ్యాపించిన దశ
 3. మెదడు, ఎముకలు, ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాపించిన దశ 

నివారణ

తరచూరొమ్ములను అద్దం ముందు నిలబడి స్వయంగా పరీక్షించుకోవడం, 40ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏడాదిన్నర నుంచి రెండేళ్లకు ఒకసారిస్క్రీనింగ్‌ పరీక్ష చేస్తే రొమ్ము క్యాన్సర్‌ ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు. 40-54 ఏళ్ల మధ్యవయసు మహిళలు ఏడాదిన్నరకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. 55 ఏళ్లు పైబడిన మహిళలు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగాస్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి. 

ఏ ఏపరీక్షలు

 • క్యాన్సర్‌ ఉందా? లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకుస్క్రీనింగ్‌ మామోగ్రామ్‌ అనే పరీక్ష ఉపయోగపడుతుంది. నలభైఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకుంటే.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు.
 • ఇప్పటికేక్యాన్సర్‌ వచ్చి.. చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారు ఏడాదికోసారి సర్వైలన్స్‌ మామోగ్రామ్‌పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.క్యాన్సర్‌ ప్రభావిత రాముతో బాటు రెండో రొమ్ములోనూ క్యాన్సర్‌ ఉంటే ఇందులో తెలుస్తుంది.
 • రొమ్ములో ఏదైనా కణితి కనిపించినా లేక కొత్తగా మార్పు వచ్చినా డయాగ్నొస్టిక్‌ మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకొని అది క్యాన్సరా కాదా నిర్ధారించుకోవచ్చు.
 • ఏ వయసువారిలోనైనా తొలిదశలోనే క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించే పరీక్ష.. డిజిటల్‌ మామోగ్రామ్‌. సాధారణ మామోగ్రామ్‌ తో పోలిస్తే.. ఇది అత్యాధునికమైన విధానం. దీనివల్ల పరీక్ష సమయంలో నొప్పితో పాటు రేడియేషన్‌ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది.
 • రొమ్ముక్యాన్సర్‌ నిర్ధారణ అయితే దశను బట్టి మందులతో, సర్జరీ, కీమో, రేడియో, హార్మోన్‌ లాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE