అవగాహన లేమి కారణంగా కొందరురక్తదానమంటే కంగారు పడతారు. ఇందుకు విద్యావంతులు కూడా మినహాయింపు కాదు. రక్తదానం చేస్తే ప్రాణాపాయమనీ, రక్తదానం చేసినప్పుడు మొత్తం రక్తం తీసుకుంటారనే కొన్నిఅపోహలే ఈ ఆందోళనకు కారణం. ఈ అపోహల వల్ల వీరు ఒక్కోసారి కుటుంబ సభ్యులకుప్రమాదం వాటిల్లినా రక్తదానానికి వెనకాడుతారు. అయితే రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి అందరినీ రక్తదానం చేసేలా ప్రోత్సహించగలిగితే ఎందరికో చక్కని ఆరోగ్యాన్ని అందించటంతో బాటు ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన వారమవుతాము.

గుర్తించాల్సిన అంశాలు

 • సాధారణంగా 18ఏళ్ళ పైబడి, 45కేజీల కంటే ఎక్కువ బరువున్న ఆరోగ్యవంతులంతా2 నెలలకు ఒకసారి నిర్భయంగా రక్తదానం చేయవచ్చు.
 • రక్తదానం చేసిన వారం రోజుల్లో తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్ తిరిగి తయారైపోతాయి. రక్తదానం చేసిన గంటల వ్యవధిలోనేతిరిగి ప్లాస్మా తయారీ మొదలవుతుంది.
 • శరీరంలోని ఐదారు లీటర్ల రక్తంలో రక్తదానం చేసినప్పుడు కేవలం 350 ml మాత్రమే సేకరిస్తారు గనుక ప్రాణ భయం అవసరం లేదు.
 • రక్తదానం చేసిన రోజు తగిన విశ్రాంతి తీసుకొని మారునాటి నుంచే అన్ని పనులూ స్వయంగా చేసుకోవచ్చు.
 • సేకరించే రక్తాన్ని అన్నివిధాలుగా పరీక్షించిన తర్వాతే దానిని ఉపయోగిస్తారు గనుక రక్తదాత నుంచి ఎలాంటి ప్రాణాంతక వ్యాధులూ రక్తనము ఎక్కించిన వ్యక్తికీ సంక్రమించవు.

ఉపయోగాలు 

 • రక్తదానం చేసే వారిలో క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
 • రక్తదానం చేసేవారిలో అధిక రక్తపోటు, దాని మూలంగా వచ్చే గుండె, మెదడు సమస్యల ముప్పు లేనట్టే.
 • రక్తదానం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
 • మధుమేహం కారణంగా మందులు, ఇన్సులిన్ తీసుకొనే వారు సైతం నిర్భయంగా రక్తదానం చేయవచ్చు.
 • రక్తంలో పరిమితికి మించి ఐరన్ ఉంటే గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో మహిళలకు ఈ ముప్పు ఎక్కువ. అందుకే తరచూ రక్తదానం చేస్తే ఈ ముప్పు తప్పిపోతుంది.
 • తరచూ రక్తదానం చేసేవారిలో రోగనిరోధకశక్తి పెరిగి అనారోగ్యం ప్రమాదం తగ్గుతుంది. దీనితో బాటు ఎప్పటికప్పుడు కొత్త రక్త కణాలు తయారై మనిషి ఉత్సాహంగా పనిచేస్తాడు. అందుకే క్రీడాకారులు పోటీకి కొన్ని వారాల ముందు రక్తదానం చేస్తారు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE