మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. నానాటికీ ఈ తరహా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి మహిళా దీని గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరం. తగినంత అవగాహన లేని కారణంగా మన సమాజంలో ఇప్పటికీ ఈ సమస్య విషయంలో లెక్కకు మించినన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటి వెనక వాస్తవాల గురించి తెలుసుకుందాం.

అపోహ: రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సమస్య.

వాస్తవం: ఇది పూర్తిగా అపోహే. పురుషులకు కూడా ఈ సమస్య రావచ్చు.

అపోహ: ముందుతరంలో ఎవరైనా రొమ్ము క్యాన్సర్ బారినపడితే తర్వాతి తరంలో వారికీ తప్పక వస్తుంది.

వాస్తవం: పెద్దలకు క్యాన్సర్ ఉన్నాతర్వాతి తరంలో కేవలం 10 శాతం కేసుల్లోనే ఈ ప్రమాదం ఉంటుంది తప్ప అందరికీ రాదు.

అపోహ: రొమ్ముల్లో వచ్చే కణుతులన్నీ క్యాన్సర్ గడ్డలే.

వాస్తవం: రొమ్ములో కనిపించే గడ్డల్లో కొవ్వు కారణంగా వచ్చేవే ఎక్కువ. 10 రొమ్ము గడ్డల్లో కేవలం ఒకటి మాత్రమే క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

అపోహ: వయసు పైబడిన మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్ కనిపిస్తుంది.

వాస్తవం: గతంలో ఈ పరిస్థితి ఉన్నమాట నిజమే అయినా ఇప్పుడు 30 ఏళ్లకే ఈ సమస్య బారినపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.

అపోహ: రొమ్ము క్యాన్సర్ కు కారణాలు ఉండవు.

వాస్తవం: వంశపారంపర్యత, సంతానం లేకపోవటం, అధిక బరువు, మెనోపాజ్ త్వరగా రావటం, 30 ఏళ్ళ తర్వాతే తొలి సంతానం కలగటం, 12 ఏళ్లకు ముందే రజస్వల కావటం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి ఎన్నో కారణాల వల్ల క్యాన్సర్ రావచ్చు.

 అపోహ: బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు

వాస్తవం: బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది తప్ప 100 శాతం రాదని ఖచ్చితంగా చెప్పలేము.

 అపోహ: గర్భనిరోధక మాత్రలు వాడితే రొమ్ము క్యాన్సర్ తప్పదు.

వాస్తవం: ఇప్పుడు లభిస్తున్న గర్భ నిరోధక మాత్రల్లో కొద్ది మొత్తంలోనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి గనుక ఈ మోతాదుతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదనే చెప్పాలి.

 అపోహ: చేతికి తగిలేంత సైజు పెరిగే వరకు రొమ్ము క్యాన్సర్ కణితిని గుర్తించడం కష్టం.

వాస్తవం: మామోగ్రఫీ పరీక్ష ద్వారా గడ్డలు తగలడానికి కొన్నేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఎంత ముందుగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.

అపోహ : మామోగ్రఫీ పరీక్ష చేసేటప్పుడు భరించలేనంత బాధ ఉంటుంది.

వాస్తవం: ఇది చాలా సులువైన పరీక్ష. ఎలాంటి నొప్పీ ఉండదు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE