శరీరానికి అవసరమైన పోషణనిచ్చేది ఆహారమే అయినా అది సరైన పద్దతిలో తినాలంటే దంతసిరి ఉండాల్సిందే.ఈ దంతసిరిని దెబ్బతీసే ప్రధానం సమస్యల్లో దంతక్షయం ఒకటి. పంటి మీద సహజంగా ఏర్పడిన పింగాణి లాంటి పదార్థం అరిగిపోవటాన్నేదంతక్షయం అంటారు. నోటిలో విడుదలయ్యే కొన్ని ఆమ్లాల ప్రభావం వల్ల దంతానికి కవచంగా ఉండే పింగాణీ పోర అరిగిపోయి పంటిలోని సున్నితమైన భాగం బయటపడుతుంది. దీనివల్ల ఆహారం తీసుకొనే ప్రతి సందర్భంలోనూ పళ్ళు జివ్వుమనటం, చల్లని వెచ్చని ఆహార పదార్థాలు పంటికి తగిలితే చెప్పలేనంత బాధ కలుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా తిన్నప్రతిసారీ నరకమే. ఇది ఏ వయస్సు లోనైనా వచ్చే సమస్య . చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ సమస్యను రాకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు తగిన చికిత్స తీసుకోవటం అవసరం.

కారణాలు

  • ఆహారం, ద్రవాలు తీసుకున్న ప్రతిసారీ సహజంగా జరిగే దంతక్షయం
  • అడ్డదిడ్డంగా బ్రష్ చేయటం, పదునైన, బలమైన కుంచెవున్న బ్రష్ వాడటం
  • ఉదయం పూట నిమ్మ, నారింజ వంటిసిట్రిక్‌ ఆమ్లం గల పళ్ళు, పళ్ళరసాలు తీసుకోవటం
  • చక్కెర తో చేసిన పదార్థాల అవశేషాలు దంతాల వద్ద పేరుకుపోవటం
  • మద్యపానం, శీతల పానీయాల వినియోగం
  • కడుపులో ఆమ్లాలు నోటిలోకి రావటం
  • దంతాల పరిశుభ్రతను పాటించకపోవడం

గుర్తించటం ఎలా?

 దంతక్షయం వల్ల పంటి లోపలి భాగాలు పైకి కనిపించడంతో బాటు దంతాలు నల్లగా, పచ్చగా మారతాయి. పళ్ళమధ్య సందులు ఏర్పడటం, పళ్ళు గుల్లబారటం,లేదా పళ్ళు అరిగటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని దంతక్షయంగా భావించాలి. దీనికితోడు చల్లని లేదా వేడి పదార్థాలు పంటికి తగిలితే నొప్పిగా ఉంటే సమస్య బలపడిందని తెలుసుకోవాలి.

చికిత్స

దంతక్షయ బాధితులు క్రమం తప్పక దంతవైద్యడ్ని సంప ద్రించటం తో బాటు చి నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరాన్ని బట్టి ఫిల్లింగ్‌ చికిత్స ద్వారా అరిగిన పళ్ళకు చికిత్స చేస్తారు.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE