వృద్ధాప్యంలో దంతాలు బలహీనపడటం, రాలిపోవడం సహజమే. అయితే ఇప్పటి రోజుల్లో 40 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి. నిజానికి  బాల్యం నుంచి దంతాల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ సమస్యను నివారించవచ్చు. రెండుపూట్లా బ్రషింగ్‌ చేసుకోవటం, ఆహారాన్ని నమిలి తినటం, తిన్న తర్వాత నోరు పుక్కిలించటం, ఏడాదికి ఒక సారైనా దంత వైద్యులకు చూపించుకోవటం, అవసరాన్ని బట్టి  దంతాల మీద చేరిన గారను స్కేలింగ్‌ చేయించుకోవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే 60 ఏళ్ళ వరకు దంత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

చాలామంది చిగుళ్ల వాపు, చిగుళ్ల వద్ద రక్తస్రావం వంటి సమస్యలున్నా వైద్యులను కలవరు. దీనివల్ల దంత మూలం బలహీనపడి, దంతాలు వూడిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఒకసారి దంతాలు ఊడటం మొదలైతే ఆహారం తీసుకోవటం కష్టమై, పోషకాహార లోపం ఏర్పడి మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదే సమయంలో వయసు పెరిగిన కొద్దీ నోరు పొడిబారి దంతాల మీద రంధ్రాలు పడటం, చిగుళ్ల బాధల వంటివీ పెరుగుతాయి. కాబట్టి చిగుళ్ల సమస్యలు, దంతాలు పుచ్చిపోవటం, జివ్వుమనటం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను చూపించుకుని, వాటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ దంతాలు వూడినా ఇప్పుడు- సమర్థమైన, శాశ్వతమైన కృత్రిమ దంతాలు (ఇంప్లాంట్స్‌) అమర్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో దంత సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE