మాతృత్వమనే కల సాకారం కావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రతి దశలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఈ 9 నెలల ప్రయాణంలో ఎదురయ్యేసమస్యల్లో గర్భస్రావం ప్రధానమైనది. తొలిసారి గర్భం ధరించినవారిలో కొన్నిసార్లు ఈ సమస్య ఎదుర య్యేమాట నిజమే. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్లకొందరిలో ఈ సమస్య పదే పదే ఎదురవుతుంది. దంపతులను తీవ్రమైన మానసిక వేదనకు దారితీసే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకున్నప్పుడేపండంటి బిడ్డను ఎత్తుకోవాలనుకునే కల సాకారం అవుతుంది. 

గర్భధారణ తర్వాత అయిదున్నరనెలల లోపు గర్భస్రావం జరిగితే దాన్ని సాధారణ గర్భస్రావంగా పరిగణిస్తారు. ఇందులో తొలి3 నెలల్లో జరిగే గర్భస్రావాన్ని ఎర్లీఅబార్షన్‌ అంటారు. ప్రతి 100 మంది గర్భిణుల్లో 20 మందిలో ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంది. అయితేకొందరిలో మూడూ అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం జరగొచ్చు. ఆ పరిస్థితినే ‘రికరెంట్‌ మిస్‌క్యారేజ్‌’ అంటారు. దీనికి కొందరిలో ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తే, మరికొందరిలో ఏ కారణమూ కనిపించదు. ఈ నేపథ్యంలో గర్భధారణకు ముందునుంచే దంపతులు ఈ తరహా సమస్యలపైగురించి అవగాహన పెంచుకొంటే ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడటం సాధ్యమవుతుంది. 

కారణాలు

 • 27 నుంచి 40 ఏళ్ళు దాటిన గర్భిణుల్లో గర్భస్రావం ముప్పు ఎక్కువ. 40 ఏళ్ళు దాటితేఈ ముప్పు రెండింతలు ఎక్కువ . దంపతుల్లో భర్త పెద్దవయసు వాడైనా గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
 • రక్తం త్వరగా గడ్డకట్టే స్వభావం ఉన్నవారిలో ఎక్కువసార్లు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
 • జన్యుపరమైన లోపాల వల్ల కూడాఈ సమస్య ఎదురుకావచ్చు.
 • బలహీనమైన గర్భాశయ ముఖద్వారం కారణంగా, గర్భాశయ ఆకృతిలో తేడాల వల్ల కూడాపలుసార్లు గర్భస్రావం కావచ్చు.
 • గర్భస్థ శిశువులో లోపాలున్నప్పుడు, తల్లికి ఉన్న కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఇందుకు కారణం కావచ్చు.
 • తల్లికి మధుమేహం,థైరాయిడ్‌ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ముందే వీటిని గుర్తించి చికిత్స తీసుకుంటే గర్భస్రావం కాకుండా చూసుకోవచ్చు.
 • తల్లికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా అబార్షన్లు జరగొచ్చు. ఈ పరిస్థితిని అల్లోఇమ్యూన్‌ రియాక్షన్‌ అంటారు.
 • అధికబరువూ, కెఫీన్‌ పదార్థాలు,ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఈ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.

అవసరమయ్యే వైద్య పరీక్షలు

 • దంపతుల్లోని క్రోమోజోముల లోపాలు, రక్తం త్వరగా గడ్డకట్టడం, యాంటీ ఫాస్పోలిపిడ్‌ సిండ్రోమ్‌, పలు ఇన్‌ఫెక్షన్లువంటిసమస్యలను గుర్తించేందుకు రక్తపరీక్ష అవసరం అవుతుంది.
 • తరచూ గర్భస్రావాలు అవుతున్న కేసుల్లో పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, గర్భాశయంలో లోపాలను గుర్తించేందుకు హిస్టెరోస్కోపీ, పొట్ట, కటివలయం, గర్భాశయం పరిశీలనకు లాప్రోస్కోపీ చేయాల్సి రావచ్చు.
 • ఒకవేళ గర్భాశయం ఆకృతిలో తేడాలుంటే సర్జరీ చేయాల్సి రావచ్చు.

జాగ్రత్తలు 

 • సంగీతం వినటం, పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం వంటి వ్యాపకాలతో మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి.
 • బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువుకు తగిన ఆహారం ఎంచుకోవాలి.
 • పోషకాహారం తీసుకోవటం ద్వారా గర్భస్థ శిశువుకు తగిన పోషణను అందేలా చూసుకోవాలి.
 • రోజూ కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
 • సంతానం కోరుకునే దంపతులు ముందుగా కౌన్సెలింగ్ తీసుకోవటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE