సువాసనలు శరీరానికే గాక మనసుకూ ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ సువాసనలు ఎన్నో రకాల మానసిక రుగ్మతలను నివారించటమే గాక శారీరక ఆరోగ్యానికీ దోహదం చేస్తాయి. ప్రకృతి సిద్దమైన సువాసనా భరిత తైలాలు, మూలికలను ఉపయోగించి చేసే వైద్యాన్ని 'ఆరోమా థెరపీ' అంటారు. 1937లో ఫ్రాన్స్ కు చెందినరెనా మౌ రిస్ అనే పెర్ఫ్యూమర్ ఈ విధానానికి రూపకల్పన చేశారు. శరీరంలోని హార్మోనుల స్థాయిని క్రమబద్దం చేయటం ద్వారా రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయటం దీని ప్రత్యేకత.

చికిత్సా విధానం

ఈ విధానంలో ఔషధ గుణాలున్న చెట్లు, మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్ల నుంచి తయారు చేసిన నూనెలను మాత్రమే వాడుతారు.వీటినే ‘ఎస్సెన్షియల్ ఆయిల్స్’ అంటారు. ఈ చికిత్సా విధానంలో తైలాలతో బాటుగా శరీరానికి తేమను అందించే పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక పరిమళ ద్రవ్యాలు, రూమ్ ఫ్రెషనర్స్ ను కూడా వాడతారు. మర్దన, వాసన చూపించటం, సుగంధ ద్రవ్యాల నీటిలో స్నానం, ఆవిరిపట్టటం వంటి అనేక రకాల ప్రక్రియలు ఉంటాయి. అరోమాథెరపీలో వాడేతైలాలు మెదడులోని లింబిక్ వ్యవస్థ పనితీరును మెరుగుపరచిభావోద్వేగాలను, హాయైన అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల సానుకూలమైన ఆలోచనలు కలిగి మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఈ చికిత్సా విధానం సాయంతో శరీరంలోని కండరాలు, కీళ్లు బలోపేతం అవుతాయి.

తైలాలు.. పనితీరు

 ఉపయోగించే తైలాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మల్లెపూల నూనెను మానసిక కుంగుబాటును తగ్గించటమే గాక యాంటి సెప్టిక్ గా, ఇన్ఫెక్షన్ల నివారిణిగా పనిచేస్తుంది. అదే.. గులాబీ నూనె వాడితే మానసిక కుంగుబాటు, ఒత్తిడి నుంచి విముక్తం కావటమే గాక గుండె, రక్తప్రసరణ, జీర్ణ కోశ, చర్మ సమస్యలు దూరమవుతాయి. గులాబీ నూనె వల్ల పురుషులకంటే మహిళల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. నిమ్మ నూనె శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించటమే గాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ, జీర్ణ సమస్యలనూ దూరం చేస్తుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని వాడొచ్చు.ఇక.. శ్వాస సమస్యల నివారణకు,ఏకాగ్రత పెంచేందుకు యూకలిప్టస్ నూనె బాగా పనికొస్తుంది. ఇది యాంటీసెప్టిక్ గా,నొప్పుల నివారిణిగానూ పనిచేస్తుంది. ముక్కు దిబ్బడ, మైగ్రేన్ తలనొప్పి, సాధారణజ్వరాలకు ఇది మంచి ఔషధం.

జాగ్రత్తలు

  • వాసన బాగున్న ప్రతి నూనె ఈ చికిత్సకు పనికిరాదు. అలావాడితే ప్రతికూల ప్రభావాలు వచ్చే ముప్పు ఉంది.
  • గర్బిణులు అరోమాథెరపీ కి దూరంగా ఉండటం మంచిది. బాలింతలు యూకలిఫ్టస్ నూనె వాడరాదు.
  • నిమ్మనూనెను ఇతర మర్దన తైలాలతో కలిపి మాత్రమే వాడాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు దీనిని వాడకూడదు.
  • తైలాలు వాడటంతో బాటు వాటి అవశేషాలు శరీరంలో పేరుకుపోకుండా చూసుకోవాలి. కనుక నిపుణుల సాయం తీసుకోవటం మంచిది.
  • హైబీపీ, మధుమేహం, చర్మ వ్యాధులున్న వారు అరోమాథెరపీ తీసుకోవాలనుకుంటే వైద్యుని సలహా కోరటంమంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE