ప్రమాదకరం కాకపోయినా మనిషిని బాగా చికాకు పెట్టే అనారోగ్య సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదులు కాలుష్యం, అలర్జీ, జలుబు వల్ల మూసుకుపోయి వాటిలో మ్యూకస్ పేరుకుపోవటంతో అక్కడ బాక్టీరియా, ఇతర క్రిములు పెరిగి సైనసైటిస్ గా పరిణమిస్తుంది. కొన్నిసార్లు పాలిప్స్ పెరగడం, కణితులు, అడినాయిడ్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. తరచు జలుబు చేయడం, జలుబు వదలకపోవటం దీని ప్రధాన లక్షణాలు. సమస్యను తొలిదశలో గుర్తించక నిర్లక్ష్యం చేస్తే ఇది చికిత్సకు లొంగకుండా పోయే ప్రమాదం ఉంటుంది.

రకాలు

సైనసైటిస్ లో  చాలా రకాలున్నాయి. ఉదాహరణకు... ఫ్రంటల్ సైనసైటిస్ ఉన్నవారిలో ఉదయం పూట తలనొప్పి ఎక్కువగా ఉండటం, నుదురు భాగంలో ఈ నొప్పి అధికంగా ఉండటం, ముక్కుఎగువభాగం , కన్ను కలిసే చోట తాకితే భరించలేని నొప్పి ఉంటాయి. అదే మాక్సిలరీ సైనసైటిస్ బాధితుల్లో దవడ పైభాగంలో నొప్పి, దంతాలు, బుగ్గలు తాకితే నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అదే.. స్ఫెనాయిడ్ సైనసైటిస్ ఉంటే గొంతులో నొప్పి, కఫము ఎక్కువగా పడటం, గొంతు మారటం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే.. ఎథ్‌మాయిడ్ సైనసైటిస్ ఉంటే వాసన గుర్తించలేక పోవటం, ముక్కు కారటం, ముక్కును గట్టిగా పెట్టుకొంటే నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

దశలు

ఆరంభ దశ

తొలినాళ్లలో జలుబు చేసి అది క్రమంగా సైనస్ ఇన్‌ఫెక్షన్ కు దారితీస్తుంది. ఈ దశలో వైరస్ సైనస్ గదులపై దాడి చేసి వాపు, నొప్పి కి దారితీస్తుంది. ఈ వైరస్‌ను బయటకు పంపేందుకు శరీరం ఎక్కువ మ్యూకస్‌ను ఉత్పత్తి చేయటంతో అది గాలి సరఫరా జరిగే సైనస్ గదుల్లో చేరి వాటిని మూసుకుపోయేలా చేస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ముక్కునుంచి దుర్వాసనతో కూడిన పసుపు లేదా ఆకుపచ్చ స్రావాలు వెలువడటం, నిద్ర లేవగానే తలనొప్పి, ముందుకు వంగితే ఈ తలనొప్పి మరింత ఎక్కువ కావటం, జ్వరం తదితర లక్షణాలు కనిపించొచ్చు. పిల్లల్లో విడువని జలుబు, ముక్కు కారడంతో పాటు వారానికి పైబడి జ్వరం ఉంటే సైనసైటిస్ అని అనుమానించాలి. 

ప్రమాదకర దశ

ఆరంభ దశలో సమస్యను నిర్లక్ష్యం చేస్తే సైనస్ గదుల్లో ఎలర్జీలు, ఫంగస్, నాసల్ పాలిప్స్, ఇన్‌ఫెక్షన్లకు దారితీసి ప్రమాదకరంగా మారుతుంది. ఈ దశలో సైనస్ గదుల వాపు, నొప్పి, మందులు వాడినా ఇన్‌ఫెక్షన్ లొంగకపోవటం, దుర్వాసనతో కూడైన ముక్కు స్రావాలు, ఏడాదిపొడవునా ముక్కులు బిగుసుకుపోవటం, శ్వాస సమస్యలు, గొంతులో ఇన్‌ఫెక్షన్, రాత్రివేళ తీవ్రమైన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో ముక్కు లోపలి పొర ఎర్రగా మారటం, రాత్రివేళ విడువని దగ్గు, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలుంటాయి.

చికిత్స 

సైనసైటిస్ కు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందుకే పై లక్షణాలు కనిపించిన వెంటనే ఈఎన్ టీ నిపుణులను సంప్రదించి వారు సూచించిన చికిత్స తీసుకోవాలి. వయసు, సమస్య దశ, రకాలను బట్టి ఈ చికిత్స మారుతుంది. వైద్యులు సూచించిన సమయం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. కొన్నాళ్ళు మందులు వాడి లక్షణాలు కనిపించలేదని మందులు ఆపితే సమస్య మళ్ళీ మొదటికి రావటమే గాక మరింత బలపడే ప్రమాదం ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE