మనదేశంలో లక్షలాది యువత బీపీఓ, ఐటీ, మీడియా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల ఉద్యోగులు అవసరాన్ని బట్టి నైట్ షిఫ్ట్ లో పనిచేయాల్సి ఉన్నా మంచి వేతనాలు, కెరీర్ వంటి పలు కారణాల వల్ల నేటి యువత దీనికి సిద్ధం అవుతున్నారు. అయితే పగటిపూట పనిచేసే ఉద్యోగులతో పోల్చితే నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో రుజువైన నేపథ్యంలో వీరంతా తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

గతి తప్పే శారీరక జీవక్రియలు

నివసించే ప్రాంత కాలానికి తగినట్టు శరీరం తన జీవక్రియల నిర్వహణను మలచుకుంటుంది. శరీర ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు, రక్త పీడనం, మూత్ర ఉత్పత్తి, కణ విభజన మరియు పలు హార్మోన్ల ఉత్పత్తి, ఉద్యాల్లె లేవటం ,రాత్రి కాగానే నిద్ర పట్టటం వంటి శారీరక క్రియలన్నీ లయబద్ధంగా, సమయానికి జరిగిపోతాయి. ఈ క్రమబద్ధమైన వ్యవహారాన్నే వైద్య పరిభాషలో 'సిర్కాడియన్ రిథమ్‌' అంటారు. అయితే నైట్ షిఫ్ట్ ఉద్యోగుల్లో ఈ'సిర్కాడియన్ రిథమ్‌'కు అంతరాయం కలిగి శారీరక జీవక్రియల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. అంతిమంగా ఇవి నిద్ర లేమి, జీవనశైలి సమస్యలు, మానసిక ఒత్తిడి,  కుటుంబ, సామాజిక సంబంధాల విచ్ఛిన్నం వంటి  ప్రతికూల ప్రభావాలుకు దారితీస్తాయి. అందుకే ఈ తరహా ఉద్యోగులు శారీరక మారుల విషయంలో తగు అవగాహనను పెంచుకోవాలి.

ప్రతికూల ప్రభావాలు

  • నైట్ షిఫ్ట్ ఉద్యోగుల ప్రధాన సమస్య.. నిద్రలేమి. పడుకోగానే నిద్ర పట్టక పోవటం, పట్టినా వెంటనే మెళకువ రావటం, 4 గంటలైనా హాయిగా నిద్రపోలేక పోవటం వల్ల కార్యాలయంలో నిద్ర పోవటం, పనితీరు మందగించటం వంటి సమస్యలు వస్తాయి.
  • ఇతర ఉద్యోగులతో పోల్చినప్పుడు రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరగా అలసిపోతారు.
  • వేళకు తినకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్ల వీరిలో ఛాతీలో మంట, కడుపుబ్బరం వంటి జీర్ణ కోశ సమస్యల బెడద ఎక్కువ.
  • పగటి పూట పనిచే వారితో పోల్చితే రాత్రిపూట పనిచేసే వారిలో గుండెపోటు, గుండె రక్త నాళాల్లో సమస్యలు వంటి సమస్యల ముప్పు   40 శాతం మేర ఎక్కువని రుజువైంది. వీరి ఆహారపుటలవాట్లలో మార్పులు, ధూమపానం, కుటుంబ సంబంధాలు బలహీనపడటం, వ్యాయామం చేయకపోవటం వంటి  అదనపు అంశాలూ ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి.
  • నైట్ షిఫ్ట్ ఉద్యోగుల్లో గ్లూకోజ్, కొవ్వు, పొటాషియం, యూరిక్ ఆమ్లాలు పెరగడం వల్ల వీరికి మధుమేహం ముప్పు ఎక్కువ. వేళకు తినకపోవడం, తిన్నప్పుడు ఎక్కువ పరిమాణంలో తినటం, వ్యాయామం లేకపోవడంతో బాటు హార్మోన్ల సమస్యలు తోడు కావటంతో వీరికి ఊబకాయం ముప్పు కూడా ఎక్కువే.
  • నైట్ షిఫ్ట్ చేసే మహిళా ఉద్యోగుల్లో ఋతు చక్రం గతి తప్పటం, అండంనాణ్యత తగ్గటం, సెక్స్ ను ఆస్వాదించలేకపోవటం, అందుకు తగ్గ సమయం లేకపోవటం వంటి ఇబ్బందుల వల్ల గర్భధారణ జరగదు. ఒకవేళ జరిగినా గర్భస్రావం కావటం, నెలలు నిండకుండానే ప్రసవం కావటం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గటం, సెక్స్ పట్ల ఆసక్తి తగ్గటం, అంగస్తంభన వంటి ఇబ్బందులు ఉంటాయి.
  • ఇతర మహిళలతో పోల్చితే రైల్వే, విమాన సిబ్బంది, నర్సులు, రేడియో మరియు టెలిగ్రాఫ్ ఆపరేటర్‌లు, పాత్రికేయులుగా పనిచేసే మహిళా ఉద్యోగులకు రొమ్ము కేన్సర్ ముప్పు ఎక్కువని పలు పరిశోధనల్లో రుజువైంది.
  • నైట్ షిఫ్ట్‌ ఉద్యోగుల్లో మెదడులోని రసాయనాల్లో వచ్చే మార్పుల వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ , త్వరగా కోపం రావటం, భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల వీరు కుటుంబ, సామజిక సంబంధాలకు దూరమవుతారు.
  • పగటిపూట పని చేసే వారితో పోల్చితే నైట్ షిఫ్ట్‌ ఉద్యోగుల పనితీరు, ఏకాగ్రతతక్కువ. దీనివల్ల వాహన, యంత్ర ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువ.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE